శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2023 (09:57 IST)

గురువారం ఈ పరిహారాలు చేస్తే.. విష్ణువును ఇలా పూజిస్తే..?

Lord Vishnu
గురువారం ఈ పరిహారాలు చేయడం ద్వారా అపారమైన సంపద, ఆనందాన్నిస్తుంది. గురువారం అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రోజుకి అధిపతి బృహస్పతి. గురువారం నాడు చేసే శ్రీవిష్ణు ఆరాధన బృహస్పతి అనుగ్రహం పొందడానికి, జీవితంలో సంపదను పొందడానికి చాలా పవిత్రమైనది. గురువారాన్ని విష్ణువు దినంగా పరిగణిస్తారు. శ్రీమహావిష్ణువుకు చేసే పూజలన్నీ గురువారమే జరగడానికి కారణం ఇదే. 
 
గురువారం దేవగురు బృహస్పతి, విష్ణువు ఇద్దరికీ అంకితం చేయబడింది. ఈ రోజు పసుపు రంగు బట్టలు ధరించి, పసుపు చందనం తిలకం నుదుటిపై ధరించాలి. ఆహారంలో పసుపును చేర్చడం కూడా ఈ రోజు ప్రత్యేకంగా పరిగణించబడుతుంది.
 
శ్రీ విష్ణువుకు కుంకుమపువ్వుతో చేసిన పాయసాన్ని సమర్పించడం వల్ల ఇంట్లో శ్రేయస్సు లభిస్తుంది. కావాలంటే ఆవుకు శెనగపప్పు, బెల్లం కూడా తినిపించవచ్చు. గురువారం నాడు అరటి చెట్టుకు పూజ చేయడం ద్వారా ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు చేకూరుతుంది. 
 
తెల్లవారుజామున ఈ పూజ చేస్తే చాలా శుభ ఫలితాలు లభిస్తాయి. ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత అరటి చెట్టుకు నీళ్ళు సమర్పించి, నెయ్యి దీపం వెలిగించి, హారతి చేయాలి. దీని వల్ల గురు గ్రహం అనుకూలంగా ఉంటుంది. 
 
గురువారం తెల్లవారుజామున స్నానం చేసి శ్రీవిష్ణువు ఆలయానికి వెళ్లి శ్రీ విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. ధూపదీపాలు, దీపాలు, పుష్పాలు, పూలమాలలు, గంధపు తిలకం, పసుపు మిఠాయిలు మొదలైన వాటిని వారికి సమర్పించాలి. విష్ణుసహస్రనామం చదవాలి.