శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 మే 2023 (09:10 IST)

ఆత్మహత్య చేసుకున్న స్నేహితుడి మృతదేహంపై అఘోరా..?

Aghora
భార్యతో గొడవపడ్డాడు. అంతే ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి స్నేహితుడి మృతదేహంపై కూర్చుని ఓ అఘోర పూజలు చేశాడు. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలోని సలూర్ సమీపంలో కురుంబపాళయానికి చెందిన మణికంఠన్ అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఇతనికి వివాహం జరిగింది. అయితే భార్యతో మనస్పర్థల కారణంగా ఇతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
తిరుచ్చికి చెందిన అతడి చిన్ననాటి స్నేహితునికి విషయం తెలిసింది. అఘోరాగా ఉంటున్న అతడు వెంటనే మరికొందరితో కలిసి సలూర్ వచ్చి స్నేహితుడి మృతదేహంపై కూర్చుని పూజలు నిర్వహించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.