ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జులై 2023 (09:27 IST)

అప్పుల బాధలను తీర్చే పిండి దీపం.. శ్రావణ శుక్ర, శనివారాల్లో వెలిగిస్తే?

flour deepam
శ్రావణమాసంలో వచ్చే శుక్ర, శనివారాల్లో పిండి దీపం వెలిగించడం ద్వారా అప్పుల బాధలు తీరిపోతాయి. ఉదయం ఐదు గంటలకు లేదా సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పిండి దీపం వెలిగిస్తే సర్వ శుభాలు చేకూరుతాయి. శ్రావణ మాసంలో దీపారాధన చేస్తే.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
శ్రావణ మాసంలో అమ్మవారికి శుక్రవారం, శనివారం శ్రీవారికి పిండి దీపం వెలిగిస్తే.. శనిదోషాలు తొలగిపోతాయి. పిండిదీపంలో నేతితో దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు వుండవు. 
 
శ్రావణమాసంలో పిండి దీపంతో దీపారాధన చేయడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా పిండిదీపంతో దీపారాధన చేసి, పూజలు చేస్తే వంశాభివృద్ధి చేకూరుతాయి. 
 
వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగ అవకాశాలు, వ్యాపారాభివృద్ధి చేకూరుతాయి. జీవితాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నాలు సఫలమవుతాయి. శత్రుభయం వుండదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.