గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 జులై 2023 (14:06 IST)

జూలై 17-శ్రావణ అమావాస్య.. రావి, మర్రి, నిమ్మ, అరటి, తులసి చెట్లను నాటితే?

శ్రావణ అమావాస్య జూలై 17వ తేదీన వస్తోంది. ఈ రోజున మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని  దేవతలకు ప్రార్థనలు చేస్తారు. ఈ రోజున శివుడిని పూజించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది కాకుండా, పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు.
 
శ్రావణ అమావాస్య వ్రత పూజ విధి
శ్రావణ మాసం నుండి రుతుపవనాలు ప్రారంభమవడంతో, పంటలు సమృద్ధిగా పండేందుకు పచ్చగా మారుతాయి.  ఈ రోజున ఉపవాసం పాటిస్తారు. 
 
● ఉదయం పూట పవిత్రమైన నది, సరస్సు లేదా చెరువులో స్నానం చేయాలి. సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. ఆపై పితృదేవతలకు తర్పణం సమర్పించాలి. 
● ఉపవాసం ఉండి, పితృదేవతలకు అన్నం సమర్పించి.. పేదలకు అన్నదానం, వస్తువులను దానం చేయండి.
● ఈ రోజున రావిచెట్టు ప్రదక్షణ మంచి ఫలితాన్నిస్తుంది. 
● శ్రావణ అమావాస్య నాడు రావి, మర్రి, నిమ్మ, అరటి, తులసి మొదలైన చెట్లను నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ చెట్లలో దేవతలు నివసిస్తారని విశ్వాసం.