శ్రావణ ఏకాదశితో పాటు శనివారం.. పిండి దీపాలతో శ్రీవారిని స్తుతిస్తే?
శ్రావణ ఏకాదశి. విష్ణువు ప్రీతికరమైన రోజు. ఈ రోజు (శనివారం ఆగస్టు 15, 2020) వస్తోంది. పరమ పుణ్యమాసంగా పిలువబడే శ్రావణంలో వచ్చే ఏకాదశి తిథి వచ్చే శనివారం పూట.. తిరుమల శ్రీవారిని పూజించిన వారికి సకలసంపదలు చేకూరుతాయి. శ్రావణ శనివారాల్లో.. ఇంటి ఇలవేల్పుని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది.
ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోయినా, ఒక్క శనివారమైనా శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. శనివారాలలో స్వామికి పాయసం, రవ్వకేసరి వంటి తీపి పదార్థాలను ప్రసాదంగా సమర్పించండం, పిండి దీపాలతో స్వామిని ఆరాధించడం, ఉపవాసం ఉండటం వంటి ప్రత్యేక పూజల వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు.
ఇంకా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. శ్రావణ శనివారం శ్రీ వేంకటేశ్వర ఆరాధన వల్ల శనిబాధలు, ఈతి బాధలు పోతాయి. అంతే కాకుండా స్వామి అనుగ్రహంతో కోరుకున్న కోరికలు నేరవేరుతాయని విశ్వాసం.