శనివారం శ్రీవారికి వ్రతమాచరిస్తే..?

venkateswara swamy
venkateswara swamy
సెల్వి|
శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శనివారం వ్రతమాచరించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అందుకే శనివారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి వ్రతానికి ఉపక్రమించాలి.

ముందుగా మండపాలంకరణ, కలశారాధన, విఘ్నేశ్వర పూజ పూర్తి చేసి తర్వాత శ్రీవేంకటేశ్వర స్వామివారికి షోడష ఉపచారాలతో పూజ చేయాలి. ఇందులో భాగంగా అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ చేయాలి. వ్రతంలో భాగంగా శనివార వ్రత కథను చదువుకోవాలి.

వ్రత ఫలితంగా నవగ్రహాల అనుకూలతను కోరుకునేవారు ఆముదం, నువ్వుల నూనె, ఆవు నెయ్యి కలిపి, నలుపు, ఎరుపు, నీలిరంగు వత్తులతో దీపారాధన చేయాలి. అలాగే నీలం రంగు పూలతో పూజ చేయడం శ్రేయస్కరం. ఉపవాసం ఆచరించి ఈ పూజకు ఉపవాసం తప్పనిసరి. రాత్రి వరకూ ఉండి పండ్లు, పాలు తీసుకోవచ్చు. ఏడువారాలు ఇలా శనివారం వ్రతమాచరించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

చివరి వారం ఉద్యాపనగా నలుపు రంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలం మొదలైనవి దానంగా ఇవ్వాలి. ఈ పూజ, వ్రతం భక్తిశ్రద్ధలతో కూడుకున్నదిగా వుంటుంది. హంగు, ఆర్భాటాలకు దూరంగా వుండాలి. వ్రతమాచరించే రోజు పవిత్రంగా ఉండాలి. ధర్మబద్ధంగా వ్యవహరించాలి. వ్రతం చేస్తున్న శనివారాలు వంకాయలు, నల్ల మిరియాలు, మినపప్పులను కొనకూడదు, తినకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.దీనిపై మరింత చదవండి :