గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

శ్వేతార్క గణపతిని బుధవారం పూజిస్తే.. జిల్లేడు చెట్టు ఇంట్లో వుండొచ్చా?

శ్వేతార్క గణపతిని పూజించడం శుభప్రదం. అదీ బుధవారం పూట శ్వేతార్క గణపతిని పూజించిన వారికి శుభాలు కలుగుతాయి. తెల్ల జిల్లేడులో గణపతి నివసిస్తాడని ప్రతీతి. దీన్ని మనం పొందగలిగి, గృహంలో ప్రతిష్టించుకోగలిగితే శుభప్రదం. శ్వేతార్క గణపతిని సాక్షాత్తూ గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద, సుఖశాంతులు లభిస్తాయి. బాగా పాతబడిన తెల్లజిల్లేడు మొదళ్ళు కొన్ని గణపతి రూపం ధరిస్తాయని, అటువంటివి బహు అరుదు అని ఆధ్యాత్మిక పండితులు చెప్తుంటారు.  
 
జాతకచక్రంలో సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు, జాతకచక్రంలో సూర్యుడు నీచలో ఉన్నవారు ఇంటికి నరదృష్టి ఉన్నవారు, వీధిపోటు ఉన్నవారు, సర్వకార్య సిద్ధి కొరకు శ్వేతార్క గణపతిని గృహంలో ఉంచుకుని పూజిస్తే చాలా మంచిది. కానీ ప్రతిష్టించుకునేందుకు సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. పండితుల్ని, పురోహితుల్ని సంప్రదించి, వారి సలహా మేరకు ముహూర్తం పెట్టించుకోవాలి.
 
తెల్లజిల్లేడు చెట్టు 45 సంవత్సరాలు దాటిన తర్వాత సహజంగానే గణపతి రూపం వస్తుంది. ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం, రోజున వేరును స్వీకరించాలి. జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరొకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును పొందినట్లైతే మహాశివుడు, విఘ్నాదిపతుల దయ మనమీద ప్రసరిస్తుందట. 
 
ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలీదని శాస్త్రాలు చెప్తున్నాయి.