సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2023 (23:13 IST)

700 ఏళ్ల తర్వాత పంచ మహాయోగం... ఈ 3 రాశులకు కనక వర్షం! (video)

astrolgy
అవును మీరు చదువుతున్నది నిజమే. 700 ఏళ్ల తర్వాత పంచ మహాయోగం ఏర్పడింది. ఫిబ్రవరి 19న ఈ యోగం సిద్ధించింది. ఈ యోగం కారణంగా..  కొన్ని రాశుల వారికి కనక వర్షం కురుస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా తమ స్థానాలను మార్చుకుంటాయి. గ్రహ సంచారాలు, సంయోగాల కారణంగా అనేక శుభ, అశుభ యోగాలను ఏర్పడుతాయి. తాజాగా 700 ఏళ్ల తర్వాత ఏర్పడిన ఈ మహాయోగం ద్వారా ఈ సమయంలో శని కుంభరాశిలో ఉంటాడు.
 
అలాగే సూర్యుడు కుంభరాశి ఆధిపత్యం వహిస్తాడు. అదే సమయంలో, గురు- శుక్రులు మీనరాశిలో కలిసి ఉంటారు. మీనరాశి గురు రాశి. దీని ఫలితంగా 700 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 19, 2023 నుండి సర్వార్థసిద్ధి యోగాలు ఏర్పడ్డాయి. ఈ యోగం మూడు రాశులకు బాగా కలిసివస్తుంది.
 
ధనుస్సు : పంచ మహాయోగం మీకు మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ సమయంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న లేదా విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఈ సమయం అనువైనది. అలాగే, ఈ సమయంలో వ్యాపారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కోర్టు కేసుల్లో విజయం సాధించవచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది.
 
మిథునం : పంచ మహాయోగం ఏర్పడడం వల్ల మిథునరాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. ఎందుకంటే మీ జాతకంలో హంస, మాలవ్య అనే రెండు రాజయోగాలు ఉన్నాయి. అందుకే ఈ సమయంలో మీరు మీ పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశం లభిస్తుంది. కార్యాలయంలో అధికారులు, సహోద్యోగుల పూర్తి సహకారం లభిస్తుంది. ఇంకా మీ కీర్తి పెరుగుతుంది. ఈ సమయం వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉంటుంది.
 
కుంభం: కుంభరాశిలో సూర్యుడు, శని సఖ్యతగా ఉండడం వల్ల కుంభరాశి వారికి పంచ మహాయోగం వరంలా ఉంటుంది. అపారమైన ధనలాభం కలుగుతుంది. మీరు పెద్ద మొత్తంలో ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. జీవితంలో లగ్జరీ పెరుగుతుంది. గొప్ప విజయం సాధించవచ్చు. జీవిత భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది. వ్యాపారంలో భాగస్వామ్యం లేదా ఒప్పందాలకు మంచి కాలం. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇది మంచి సమయం. రాజకీయాలకు సంబంధించిన వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.