శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2022 (12:40 IST)

సూర్య గ్రహణం 2022: కన్యరాశి, వృశ్చిక రాశి జాగ్రత్త!

దీపావళి సందర్భంగా ఏర్పడే సూర్యగ్రహణంతో ఈ రాశుల వారు జాగ్రత్తగా వుండాలి అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం కావడంతో ఈ రాశుల వారు అప్రమత్తంగా వుండాలట. దీపావళి అక్టోబర్ 24న ఉండగా, సూర్యగ్రహణం మరుసటి రోజు - అక్టోబర్ 25న ఉంటుంది. 
 
ఈ సూర్యగ్రహణం 12 సూర్యరాశులను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. 
మేషం: వివాహిత స్త్రీలు మరియు వారి భర్తలు చికాకులు ఎదుర్కొంటారు
వృషభం: అనవసరమైన టెన్షన్- ఆందోళన తప్పదు
మిథునం : ఎక్కువ ఖర్చులు, పనులు ఆలస్యం అవుతాయి
కర్కాటకం: పనులు విజయవంతంగా సాగుతాయి
సింహం: ధనలాభం ఉంటుంది.
కన్య:  ధన నష్టం తప్పదు.
తుల: ఆందోళన, ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి
వృశ్చికం: కన్యారాశి వారిలాగే ధన నష్టాన్ని ఎదుర్కొంటారు
ధనుస్సు: లాభం, అభివృద్ధి ఉంటుంది
మకరం: రోగాలు వచ్చే అవకాశాలు, భయం
కుంభం: పిల్లల విషయంలో ఆందోళనలు ఉంటాయి
మీనం: శత్రువులతో ముప్పు వుంది. లాభాలు కూడా వుంటాయి.