ఆనంద నిలయం అనంత స్వర్ణమయం దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం పొడిగింపు
'ఆనంద నిలయం అనంత స్వర్ణమయం' పథకం దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని పొడిగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో, ఈ పథకం కింద దాతలకు దర్శనానంతర ప్రత్యేక ఆచారాలను అందించేవారు.
ప్రస్తుతం ఈ దాతలకు సంవత్సరానికి మూడు రోజుల వీఐపీ బ్రేక్ దర్శనం, వసతి సౌకర్యాలను అనుమతిస్తుంది. అనివార్య కారణాల వల్ల 2008లో 'ఆనంద నిలయం అనంత స్వర్ణమయం' పథకాన్ని నిలిపివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఇకపోతే.. తిరుమలలో గత మూడు రోజులుగా భారీగా వర్షపాతం నమోదు అయింది. ఈ భారీ వర్షాల కారణంగా తిరుమలలోని జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి.
తిరుమలలో వెళ్లే రెండవ ఘాట్ రోడ్డులోని 5వ కిలోమీటర్ వద్ద రోడ్డుపై కొండచరియలు విరిగిపడి రోడ్డును బ్లాక్ చేశాయి. రోడ్డుకు అడ్డంగా కొండచరియలు విరిగిపడటంతో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం కలిగింది.