12-08-2018 నుండి 18-08-2018 వరకు మీ వార రాశి ఫలితాలు

కర్కాటకంలో రవి, వక్రి బుధ, రాహువులు, కన్యలో శుక్రుడు, తులలో బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో వక్రి కుజ, కేతువులు. సింహ, కన్య, తుల వృశ్చికంలో చంద్రుడు. 17వ తేదీన రవి సింహ ప్రవేశం, 12 నుండి శ్రావణ మాసం ప్రారంభం. అమ్మవారి ఆరాధన అన్ని రాశుల వారికి శు

Astro
Raman| Last Modified శనివారం, 11 ఆగస్టు 2018 (23:14 IST)
కర్కాటకంలో రవి, వక్రి బుధ, రాహువులు, కన్యలో శుక్రుడు, తులలో బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో వక్రి కుజ, కేతువులు. సింహ, కన్య, తుల వృశ్చికంలో చంద్రుడు. 17వ తేదీన రవి సింహ ప్రవేశం, 12 నుండి శ్రావణ మాసం ప్రారంభం. అమ్మవారి ఆరాధన అన్ని రాశుల వారికి శుభదాయకం. 14 మంగళ గౌరీవ్రతం. 16న గరుడపంచమి.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంప్రదింపులతో హడావుడిగా ఉంటారు. గృహంలో సందడి నెలకొంటుంది. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. మంగళ, శని వారాల్లో ఖర్చులు అధికం. పనులు వేగవంతమవుతాయి. మీ జోక్యం అనివార్యం. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. బంగారం, వెండి సామగ్రి కొనుగోలు చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. అధికారులకు అదనపు బాధ్యతలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదారు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వివాహ యత్నాలు సాగిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. గృహమార్పు కలిసివస్తుంది. ధనలాభం ఉంది. అవసరాలు నెరవేరుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వస్తు నాణ్యతను గమనించండి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆహ్వానం అందుతుంది. గురు, శుక్ర వారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. స్థిమితంగా ఆలోచించండి. హామీలివ్వవద్దు. విద్యా ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. నిరుద్యోగుకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పదమీయోగం. కంప్యూటర్ రంగాలవారికి ఆశాజనకం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. కాంట్రాక్టురు చేజిక్కించుకుంటారు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో ముందుకు సాగండి. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుకాదు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. ఆర్థికస్థితి సామాన్యం. ఖర్చులు విపరీతం. ధన సమస్యలెదుర్కుంటారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. శనివారం నాడు ఒత్తిళ్లకు లొంగవద్దు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వృత్తుల వారిక సామాన్యం. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి.  
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ వారం ఖర్చులు విపరీతం. పొదుపు మూలక ధనం గ్రహిస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడుతారు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. భాగస్వామిక చర్చలు కొలిక్కివస్తాయి. సాంస్కృతిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. కొంతమెుత్తం ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. సంతానం వైఖరి అసహానం కలిగిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుంది. వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుతాయి.  
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శుభకార్యం నిశ్చయమవుతుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఖర్చులు విపరీతం, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. పరిచయాలు, బలపడుతాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. తొందరపడి హామీలివ్వవద్దు. ఆది, సోమవారాల్లో అనేక పనులతో సతమతమవుతారు. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాభివృద్ధఇకి మరింతగా శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. విద్యార్థులకు దూకుడు తగదు. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. అంచనాలు ఫలిస్తాయి. చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మంగళ, బుధ వారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులు, సంస్థల స్థాపనలకు అనుకూలం. నగదు, పత్రాలు జాగ్రత్త. వ్యాపారాల్లో నష్టాలను పూడ్చుకుంటారు. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ఉద్యోగస్తులకు ఉపశమనం లభిస్తుంది. క్రీడాకారులకు నిరుత్సాహకరం.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ
పరిస్థితుల అనుకూలత ఉంది. వేడుకల్లో పాల్గొంటారు. ఆత్మీయుల కలయిక సంతోషాన్నిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఖర్చులు సంతృప్తికరం. వాహనం కొనుగోలు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. గురు, శుక్ర వారాల్లో అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. వృత్తుల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది.    
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. దుబారా ఖర్చులు అధికం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కుటుంబ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వ్యవహారాల్లో ప్రతికూలతలెదుర్కుంటారు. ఆర్థికస్థితి నిరాశాజనకం. శనివారం నాడు శ్రమించినా ఫలితం ఉండదు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. అనేక పనులతో సతమతమవుతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. లౌక్యంగా వ్యవహరించాలి. సన్నిహితులను కలుసుకుంటారు. విమర్శలు, వ్యాఖ్యాలకు దీటుగా స్పందిస్తారు. వ్యాపారాలు క్రమగా ఊపందుకుంటాయి. కంప్యూటర్, అకౌంట్స్ రంగాలవారికి ఆదాయాభివృద్ధి. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. ప్రయాణం తలపెడుతారు. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతో వ్యవహరించండి. ఖర్చులు సామాన్యం. ఆప్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆది, సోమ వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం ఉత్సాహాన్ని అదుపు చేయండి. ఆహ్వానం అందుకుంటారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. గత సంఘటనలు గుర్తుకొస్తాయి. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. దళారులను విశ్వసించవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. వృత్తుల వారికి సామాన్యం. కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి. దైవకార్యంలో పాల్గొంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభిస్తాయి. ఆందోళన తొలగి కుదుటపడుతారు. గృహంలో స్తబ్ధత తొలుగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అకాశాలను తక్షణం వినియోగించుకోండి. పనుల మెుండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయమార్గాలు అన్వేషిస్తారు ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. మంగళ, బుధ వారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ఉపాధ్యాయుల కష్టం ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులను ధనప్రలోభం తగదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.   
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. బంధువులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. విమర్శలు పట్టించుకోవద్దు. ఆది, గురు వారాల్లో పనులు మెుండిగా పూర్తిచేస్తారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రియతములను కలుసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. అధికారులకు హోదా మార్పు, ఉద్యోగస్తులకు పదవీయోగం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. విద్యార్థులకు కొత్త పరిచయాలేర్పడతాయి.దీనిపై మరింత చదవండి :