శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 1 జూన్ 2019 (21:52 IST)

02-06-2019 నుంచి 08-06-2019 వరకు మీ వార రాశి ఫలితాలు(Video)

మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. 
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు బలపడతాయి. వేడుకలకు హాజరవుతారు. శనివారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. సంతానం చదువులపై దృష్టిపెడతారు. విద్యాప్రకటనలను విశ్వసించవద్దు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. గృహమార్పు కలిసివస్తుంది. పెట్టుబడులకు తరుణం కాదు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కొన్ని ఇబ్బందులను తొలగుతాయి. మానసికంగా కుటుంటపడతారు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. షాపులకు స్థలమార్పు అనివార్యం. సరకు నిల్వలో జాగ్రత్త. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
ప్రేమానుబంధాలు బలపడతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. వివాహ ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అవకాశాలు కలిసివస్తాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఖర్చులు అధికం. రాబడిపై దృష్టిసారిస్తారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆది, సోమవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సంప్రదింపులకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు అధికారులకు స్థానచలనం. దైవ సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. రాబడిపై దృష్టిపెడతారు. పంతాలు పట్టుదలకు పోవద్దు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. అవకాశాలు చేజారిపోతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. మంగళ, బుధ వారాల్లో వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. నిరుద్యోగులకు కృషి ఫలిస్తుంది. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దైవ కార్యంలో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
వేడుకలకు హాజరవుతారు. మీ మాటతీరు ఆకట్టుకుంది. అనుకూల పరిస్థితులున్నాయి. రావలసిన ధనం అందుతుంది. వాహనయోగం. వస్త్రప్రాప్తి ఉన్నాయి. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. గురువారం నాడు విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పదువుల, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. ఉపాధ్యాయులకు పదవీయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. బెట్టింగుల ట్ల అవస్థలు తప్పవు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
ఆశించిన పదవులు దక్కవు. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. శుక్ర, శనివారాల్లో ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం ఖర్చు చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా ఆలోచించవద్దు. విశ్రాంతి అవసరం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తాయి. ఒక సంబంధం ఆసక్తిని కలిగిస్తుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఉపాధ్యాయులకు పదోన్నతి. స్థానచలనం. సహోద్యోగులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తుల వారి ఆదాయం బాగుటుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలనిస్తాయి. వ్యాపారాలు విస్తరణలకు తగిన సమయం. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ప్రముఖులకు అభినందలు తెలియజేస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3 4 పాదాలు. హస్త, చిత్త 1, 2 పాదాలు. 
చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. వ్యవహారానుకూలత ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. ఆది, సోమవారాల్లో పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానంపై చదువులపై దృష్టిపెడతారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం పై చదువులపై దృష్టిపెడతారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండ. పూర్వ విద్యార్థులకు కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. దైవకార్యంలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలగాల్సి వహించండి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖథ 1, 2 3 పాదాలు. 
గృహం ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆదాయం బాగుంటుంది. రుణ విముక్తులవుతారు. ఖర్చులు భారం కావు. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. కొత్త విషయాలపై దృష్టిపెడతారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. నగదు, ఆభరణాల పట్ల జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత లోపం. సౌమ్యంగా మెలగండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే అనుకూలం. సంతానం విజయం ఉత్సాహనిస్తుంది. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 
ఈవారం అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. రుణాలు, చేబదుళ్లు తప్పవు. ఓర్పుతో వ్యవహారించాలి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుకాదు. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వృత్తి ఉపాధిపథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు కార్యక్రమాలకు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. జూదాలు, బెట్టింగులు వివాదాస్పదమవుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్లు వదిలేయండి. లౌక్యంగా వ్యవహరించాలి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. మంగళ, బుధవారాల్లో ఖర్చులు అదుపులో వుండవు. సాయం చేసేందుకు బంధువులు సందేహిస్తారు. అవసరాలు అతికష్టంమీద తీరుతాయి. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. సరుకు నిల్వల్లో జాగ్రత్త. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. 
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు వ్యాపకాలు అధికమవుతాయి. ఏ సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంటారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ఖర్చులకు అదుపు వుండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. గురు, శుక్రవారాల్లో పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. నోటీసులు, ఆహ్వానం అందుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. కొనుగోలుదార్లతో జాగ్రత్త. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
కుంభం: ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. వాహనయోగం, ధనలాభం వున్నాయి. సమర్థతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులౌతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. శనివారం నాడు పత్రాలు సమయానికి కనిపించవు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేసే దిశగా యత్నాలు సాగిస్తారు. చెల్లింపుల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులకు పదోన్నతి, స్థానచలనం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగా వారికి పురోభివృద్ధి. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. త్వరలో శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఆది, సోమవారాల్లో విమర్శలు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. కొన్ని సమస్యలు తొలగి కుదుటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రావలసిన ధనం అందుతుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. గృహమార్పు అనివార్యం. పనులు మందకొడిగా సాగుతాయి. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.