శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శనివారం, 25 మే 2019 (16:39 IST)

26-05-2019 నుంచి 01-06-2019 వరకు వార రాశిఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ముఖ్యం. అవగాహన లోపం వల్ల ఒక అవకాశాన్ని చేజార్చుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానం, వస్త్రప్రాప్తి వంటి శుభఫలితాలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా పాటించడం మంచిది. మంగళ, బుధవారాల్లో దేనియందు ఏకాగ్రత అంతగా ఉండదు. గత సంఘటనలు పదే పదే జ్ఞప్తికి వస్తాయి. ఆత్మీయులకు ఒక ముఖ్య సమాచారం అందిస్తారు. విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. స్థోమతకు మించి ఖర్చులు చేయవలసి రావచ్చు. అదనపు రాబడి కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు, ఉపాథి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. చేపట్టిన పనులు ఆలస్యంగా అయినా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు.  
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. రాబడికి మించి ఖర్చులుంటాయి. దుబారా ఖర్చులు నివారణ సాధ్యం కాదు. మీ శ్రీమతితో అభిప్రాయభేదాలు, కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. సౌమ్యంగా మెలిగి గృహ ప్రశాంతతను కాపాడుకోవాల్సి ఉంటుంది. వృత్తిపరంగా ప్రముఖులను కలుసుకుంటారు, ఆది, గురువారాల్లో ఆకస్మికంహా విచ్చేసిన బంధువుల వల్ల అసౌకర్యానికి లోనవుతారు. మీ అభిప్రాయాలు, నిర్ణయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. వాణిజ్య ఒప్పందాలు, నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. మీ తొందరపాటుతనం వల్ల వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. స్త్రీలకు పనివారలు, సంతానంతో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలు, అధికారులతో చర్చలు ఆందోళన కలిగిస్తాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలులో ఏకాగ్రత ముఖ్యం. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. 
 
మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
పరిస్థితులు అనుకూలం. మీ పనులు, కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో అభివృద్ధి సాధిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానం అందుతుంది. ఖర్చులు మీ బడ్జెట్‌కు అనుగుణంగానే ఉంటాయి. ప్రముఖులు, ఆత్మీయులను కలుసుకుంటారు. మంగళ, శనివారాల్లో అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. మిమ్ములను ఆందోళనకు గురిచేసిన సమస్య సునాయాసంగా పరిష్కారమవుతుంది. స్త్రీలకు పెద్దల ఆశీస్సులు, అయిన వారి ఆదరణ, వస్త్రప్రాప్తి వంటి శుభఫలితాలున్నాయి. ఆరోగ్యంలో నిర్లక్ష్యం కూడదు. వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. భాగస్వామిక ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తుల సమర్థత, సమయస్ఫూర్తికి గుర్తింపు, నగదు బహుమతి వంటి ప్రోత్సాహకాలున్నాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావడం మంచిది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికం. 
 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
మీ ఆర్థికస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఖర్చులు అదుపు కాకపోగా మరింత ధన వ్యయం అవుతుంది. దేనికీ కలిసిరాని కుటుంబీకుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. గురు, శుక్రవారాల్లో చేపట్టిన పనులు అనుకున్న విధంగా సాగక విసుగు కలిగిస్తాయి. ఆత్మీయుల రాకతో ఉత్సాహం చెందుతారు. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దలు, అనుభవజ్ఞుల సలహా పాటించడం శ్రేయస్కరం. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు పూర్తి చేసి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాథి పథకాలపై ఆసక్తి నెలకొంటుంది. పత్రికా సంస్థల్లోని వారికి ఏకాగ్రత ముఖ్యం. ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు, లీజు వ్యవహారాలు మరికొంత కాలం పొడిగించుకోవాలన్న మీ ఆలోచన ఫలిస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు ఆశాజనకం. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు పనివారలతో చికాకులు తప్పవు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మీ శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం పొందుతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. దంపతులకు మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. అయిన వారి రాక సంతోషం కలిగిస్తుంది. ఖర్చులు రాబడికి తగినట్టుగానే ఉంటాయి. రుణం తీర్చడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. శనివారం నాడు చెక్కుల జారీ, చెల్లింపుల్లో జాగ్రత్త వహించండి. ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరం. మీ మాటకు ఇంటా బయటా మంచి స్పందన లభిస్తుంది. చేపట్టిన పనులు హడావుడిగా పూర్తి చేస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. సాహస కృత్యాల జోలికి పోవద్దు. మీ సంతానానికి కోరుకున్న విద్యావకాశాలు లభిస్తాయి. ప్రముఖుల కోసం పడిగాపులు తప్పవు. ఆస్తి పంపకాల విషయంలో పెద్దల నిర్ణయాన్ని శిరసావహిస్తారు. కొన్ని విషయాలు కష్టం కలిగించవచ్చు. కోర్టు వాజ్యాలు ఉపసంహరించుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనలు సంతృప్తినిస్తాయి. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ వారం కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు ఆదాయానికి మించి ఉంటాయి. చేబదుళ్లు స్వీకరిస్తారు. కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. ఎదుటివారిని నిందించక మీ పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. స్త్రీలకు విలువైన వస్తువుల కొనుగోలులో ఏకాగ్రత ముఖ్యం. అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. చేపట్టిన పనులు పూర్తి కాక నిరుత్సాహం చెందుతారు. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. విద్యార్థులు అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. ఉద్యోగస్తులకు బాధ్యతల నిర్వహణలో అధికారులు, తోటివారి సహకారం అందుతుంది. నిరుద్యోగులు ఉపాథి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వృత్తుల వారికి సంఘంలో గుర్తింపు, శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు ఎంతకీ పరిష్కారం కాక విసుగు చెందుతారు. పత్రికా, వార్తా సంస్థల్లోని వారికి ఏకాగ్రత, పునరాలోచన అవసరం. మీ వాహనం, విలువైన వస్తువులు ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కొంటారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థిక లావాదేవీలు, అనుకున్న పనులు ప్రశాంతంగా సాగుతాయి. ఒక వ్యవహారం సానుకూలించడంతో మానసికంగా కుదుటపడతారు. ఊహించని పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. అవసరానికి సహకరించినా మిత్రుల ధోరణి ఆగ్రహం కలిగిస్తుంది. మీ శ్రీమతితో సౌమ్యంగా మెలగండి. ఆరోగ్య జాగ్రత్త. విద్యార్థులకు రెండవ విడత కౌన్సెలింగ్ కలిసిరాగలదు. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి క్రమంగా నిలదొక్కుకుంటారు. నూతన పెట్టుబడులు, సంస్థలు, ప్రాజెక్టుల ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేయటం శ్రేయస్కరం. ఉద్యోగస్తుల కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పత్రికా సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. క్వారీ, ఇసుక కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలు, సమస్యలు తప్పవు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు జయం, వైద్యరంగాల వారికి ఏకాగ్రత ముఖ్యం.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
వృత్తి ఉద్యోగాల్లో ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. కష్టం మీది ప్రతిఫలం మరొకరిదీ అన్నట్టుగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. దుబారా ఖర్చులు అధికం. ఆది, సోమవారాల్లో మీ శ్రీమతి గొంతెమ్మ కోరికలు ఇరకాటానికి గురిచేస్తాయి. ఆత్మీయు రాకతో గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానం అందుతుంది. భాగస్వామిక, సొంత వ్యాపారాల పట్ల శ్రద్ధ అవసరం. విద్యార్థినులకు కొత్త పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఒక స్థిరాస్తి విక్రయించే ఆలోచన విరమించుకోవడం మంచిది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో మెలకువ వహించండి. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. క్రీడ, కళాకారులకు ఆదరణ లభిస్తుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో చికాకులు తప్పవు. ఒకేసారి అనేక పనులు మీద పడటంతో ఒత్తిడికి గురవుతారు. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. వ్యవసాయ రంగాల వారికి చికాకులు అధికం. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులున్నా ఇబ్బందులుండవు. మంగళ, బుధవారాల్లో కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. దంపతుల మధ్య సఖ్యత లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు మరికొంత కాలం ఆగటం మంచిది. మీ పథకాలు, ప్రణాళికలు మునుముందు మంచి ఫలితాలనిస్తాయి. పనివారలను ఓ కంట కనిపెట్టడం మంచిది. స్త్రీలకు వస్త్రప్రాప్తి, ఆహ్వానం వంటి శుభఫలితాలున్నాయి. ఉద్యోగస్తులు ఓర్పు, ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. ఆస్తి వ్యవహారాలు, స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. 
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శుభవార్తా శ్రవణం, ధనలాభం, వస్త్రప్రాప్తి వంటి శుభఫలితాలున్నాయి. ప్రయత్నపూర్వకంగా ఒక అవకాశం కలిసివస్తుంది. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. స్త్రీలు విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. హామీలు, ఒప్పందాల విషయంలో జాగ్రత్త. గురు, శుక్రవారాల్లో అయిన వారితోనే అయినా వ్యవహారంలో ఖచ్చితంగా మెలగండి. ధనమూలకంగా కొత్త సమస్యలెదుర్కుంటారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు దూకుడు పనికిరాదు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిదని భావించండి. భాగస్వామిక సమావేశాల్లో కొత్త అంశాలు చర్చకు వస్తాయి. ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేసే విషయంలో తోటివారు సహకరిస్తారు. ఉన్నతాధికారుల హోదా పెరగడంతో పాటు స్థానచలనం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఒక వ్యవహారం సానుకూలం కావడంతో మీలో ఉత్సాహం నెలకొంటుంది. అయిన వారి కోసం ధనం బాగా వెచ్చిస్తారు. దాంపత్యసుఖం, మానసికోల్లాసం పొందుతారు. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. శనివారం నాడు బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో మరొకరి తోడుండటం మంచిది. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు చికాకులు తప్పవు. వ్యాపారాల్లో కొత్తకొత్త స్కీములతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఏ వ్యక్తికీ పూర్తి బాధ్యతలు అప్పగించడం మంచిది కాదు. ఇతరుల కారణంగా మాటపడవలసి వస్తుంది. స్త్రీలు టీవీ కార్యక్రమాల్లో రాణిస్తారు. విద్యార్థులకు రెండవ విడత కౌన్సెలింగ్‌లో ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు ఆలస్యంగా గుర్తిస్తారు. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాథి పథకాల దిశగా సాగుతాయి. గృహ నిర్మాణాలకు కావలసిన ప్లానుకు ఆమోదం. హోసింగ లోన్లు మంజూరు కాగలవు. వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలులో చికాకులు ఎదురవుతాయి. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆర్థికస్థితి ఆశాజనకం. రుణాలు, పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. పెద్ద ఖర్చులు తగిలినా ఇబ్బందులుండవు. మీ శ్రీమతి, సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు, ముఖ్యమైన వ్యవహారాలు మీరు చూసుకోవడమే ఉత్తమం. ఆది, సోమవారాల్లో ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదు. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారులకు ఆశాజనకం. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. స్త్రీలకు బంధువులు, పొరుగువారి నుంచి ఆహ్వానం అందుతుంది. ఆరోగ్యం, ఆహార విషయాల్లో జాగ్రత్తగా వహించండి. మీ సంతానం విద్యా, ఉద్యోగ, వివాహ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన మార్పులుంటాయి. పత్రికా సిబ్బంది ఆవేశం అనర్థాలకు దారితీసే ఆస్కారం ఉంది. ప్రతి విషయంలోను లౌక్యంగా మెలగాలి. నిరుద్యోగులకు ఉద్యోగ సమాచారం అందుతుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. దైవదర్శనాలు, మొక్కుబడులకు అనుకూలం. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులు, అధికారులతో సమస్యలు తప్పవు.