ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: శనివారం, 13 ఏప్రియల్ 2019 (19:55 IST)

14-04-2019 నుంచి 20-04-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ప్రణాళికలు రూపొందించుకుంటారు. పరిస్థితుల అనుకూలత ఉంది. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆది, సోమ వారాల్లో ఓర్పుతో వ్యవహరించాలి. ఏ విషయాన్ని తీవ్రంగా తీసుకోవద్దు. సంతానం చదువులపై నిర్ణయానికి వస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. నిర్మాణాలు మరమ్మత్తులు ముగింపుకొస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తొలగి కుదుటపడుతారు. ఖర్చులు అధికం, సంతృప్తికం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. అంచనాలు ఫలిస్తాయి. మీ నమ్మకం వమ్ముకాదు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మంగళ, శుక్ర వారాల్లో ప్రముఖుల సందర్శనం సాధ్యపడదు. కార్యక్రమాలు వాయిదా పడుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆప్తులను కలుసుకుంటారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడుతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. వివాదాలు, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. శుభకార్యం నిశ్చయమవుతుంది. పెట్టిపోతల్లో ఏకాగ్రత వహించండి. సాధ్యం కానీ హామీలివ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసలాకు వ్యయం చేస్తారు. బుధ, గురు వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. వస్త్ర, పచారీ, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. విద్యార్థులకు దూకుడు తగదు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. తీర్ణయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.  
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. శుక్ర, ఆది వారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. పనులు హడావుడిగా సాగుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ద్విచక్ర వాహనంపై దూకుడు తగదు.   
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం ఉన్నాయి. వేడుకల్లో ప్రముఖంగా పాల్గొంటారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. పనులు వేగవంతమవుతాయి. శనివారం నాడు అనవసర జోక్యం తగదు. సంతానం పై చదువులను వారి ఇష్టానికి వదిలేయండి. విద్యాప్రకటనలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు తగిన సమయం. భాగస్వామిక చర్యలు ఫలిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఆత్మీయుల యోగక్షేమాలు తెలుసుకుంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. ఒక ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. పరిచయాలు అనుకూలిస్తాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు మందకొడిగా సాగుతాయి. ఆది, సోమ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరి విసుగు కలిగిస్తుంది. అనునయంగా మెలగాలి. ఎవరినీ నిందించవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.    
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగండి. గత అనుభవంతో ఒక సమస్యను అధిగమిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. రుణ బాధలు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు  జరుపుతారు. మంగళ, బుధ వారాల్లో పనులు సాగవు. శకునాలు పట్టించుకోవద్దు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆత్మీయుల యోగక్షేమాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి. క్రీడాకారులకు ప్రోత్సాహకరం.    
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
వేడుకల్లో పాల్గొంటారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. ఊహించని బాకీలు వసూలవుతాయి. ఖర్చులు భారమనిపించవు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం సాయం క్షేమం కాదు. పనులు అనుకున్న విధంగా పూర్తికాగలవు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. గురు, ఆది వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుకాదు. ఆహ్వానాలు అందుతాయి. టెండర్లు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ప్రయాణం చికాకుపరుస్తుంది.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
గృహమార్పు కలిసివస్తుంది. సంతానం విదేశీ చదువులపై దృష్టి పెడతారు. వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు విపరీతం. సమర్థతను చాటుకుంటారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచనలు అవసరం. పనులు చురుకుగా సాగుతాయి. శుక్ర, శనివారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సహోద్యోగులతో విందులు, వేడుకల్లో పాల్గొంటారు. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2, పాదాలు
నిలిచిపోయిన పనులు పునఃప్రారంభిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆది, సోమ వారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. పెద్దమొత్తం సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా ఆలోచింపవద్దు. విశ్రాంతి అవసరం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ వారం సంప్రదింపులకు అనుకూలం. చాకచక్యంగా వ్యవహరించాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. శుభకార్యంలో పాల్గొంటారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. మార్కెట్ రంగాలవారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాలవారికి కొత్త సమస్యలెదురవుతాయి. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అనుకూల పరిస్థితులున్నాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. పనులు సకాలంలో పూర్తికాగలవు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. పెట్టిపోతల్లో ఏకాగ్రత వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. వైద్య, సేవా, సాంకేతిక రంగాలవారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వీడియో చూడండి...