suvichar
✕

ఇందరికీ అభయంబు లిచ్చు చేయి

Written By సిహెచ్
Updated: గురువారం, 16 డిశెంబరు 2021 (23:09 IST)
తాళ్లపాక అన్నమాచార్య కీర్తనలు ఎంత విన్నా తనివితీరనవి. సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరుడే ఆయన కీర్తనలకు మురిసిపోయారని పురాణాలు చెపుతున్నాయి. గోవిందుడి అభయ హస్తం గురించి అన్నమయ్య రచించిన పదకవిత చూడండి.
 
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి
 
వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి
విలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కలికియగు భూకాంత కాగలించిన చేయి
వలవైన కొనగోల్ల వాడిచేయి
 
తనివోక బలి చేత దానమడిగిన చేయి
వొనరంగ భూ దాన మొసగు చేయి
మొనసి జలనిధి యమ్ముమొనకు తెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి
 
పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి
తిరువేంకటాచల ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి

అన్నీ చూడండి

ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ

రూ.36,000 కోట్ల విలువైన ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం

నాలుగు నెలల పాటు ప్రజల సందర్శనార్థం రుషికొండ ప్యాలెస్

మహిళా ఐఏఎస్ అధికారిణికి అసభ్య సందేశాలు: టీవీకె ఎమ్మెల్యే విఘ్నేష్ అరెస్ట్

అనంత్ సింగ్ కుమార్తె వివాహం వైరల్: అన్నం కోసం కొట్టుకున్నారు.. 25 లక్షల రసగుల్లాలు సెకన్లలో మాయం..(video)

అన్నీ చూడండి

28-11-2026 శనివారం దిన ఫలాలు - పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త వహించండి

వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్ల విడుదల వివరాలు ప్రకటించిన తితిదే

అరుణాచలం గిరి ప్రదక్షిణకు పోటెత్తిన ఆంధ్ర భక్తులు, గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు?

27-11-2026 శుక్రవారం దిన ఫలాలు - మాటతీరులో సంయమనం పాటించడం మంచిది..

శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబా దేవిల స్పర్శ దర్శనం

తర్వాతి కథనం
Show comments