సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By సిహెచ్
Last Modified: శనివారం, 4 డిశెంబరు 2021 (22:38 IST)

విశ్వభ్రమణకారిణి... ఓం శ్రీ లలితా రాజరాజేశ్వరీ...

లలితా సహస్రనామాల్లో ఓ నామం విశ్వభ్రమణకారిణి అనేది. అంటే.. ప్రపంచంలో వున్న అన్నిటినీ కదిలించేది అమ్మ అని అర్థం. ప్రపంచంలో వున్న అన్నిటినీ తిప్పుతూ నడిపించేది అని కూడా అర్థం. భూమి అనేది కదులుతూ వుండని పక్షంలో మనం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి.

 
నీళ్లు కదులుతూ వుండని పక్షంలో నావ నడవదు. మనం నీళ్లను సేవించలేం. వాయువు కదులుతూ వుండనట్లయితే మనం గాలిని పీల్చుకోలేం. అగ్ని కూడా తన కణాలను ఒకదానికొకటి కదులుతూ వుండకపోతే మంట నిలవలేదు. మనం వంటను చేసుకోలేం. ఆకాశం అనేది కదలని పక్షంలో గ్రహాల పరిభ్రమణమే వుండదు. వీటన్నిటినీ తీర్చుతూ ఈ విశ్వాన్ని నడిపించేది అమ్మ అని దీని అర్థం.