ఆదివారం ఆదిత్యుడిని పూజిస్తే...?
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ అని అంటారు. అంటే ఆరోగ్యం కావాలనుకునే వారు సూర్యుడిని ఆరాధించాలి. ఆదివారం నాడు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే స్నానం చేసిన తర్వాత రాగి పాత్రతో సూర్యుడికి నీటిని(అర్ఘ్యం) సమర్పించడం శుభప్రదం.
ఆదివారం నాడు ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల శత్రువులపై విజయం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. సూర్యుడిని స్తుతిస్తూ ఈ అష్టకాన్ని చదవడం వల్ల పాపాలు నశిస్తాయని నమ్మకం. ఆదివారం ఎరుపు రంగు దుస్తులు ధరించడం లేదా సూర్యుడికి ఎర్రటి పూలతో పూజ చేయడం విశేషం.
గోధుమలు, బెల్లం లేదా రాగి వస్తువులను దానం చేయడం వల్ల జ్యోతిష్య రీత్యా సూర్య దోషాలు తొలగిపోతాయి. కొందరు ఆదివారం నాడు ఉప్పు లేని ఆహారం తీసుకుని సూర్య వ్రతాన్ని ఆచరిస్తారు.
