బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By PNR
Last Updated : బుధవారం, 3 జులై 2019 (14:11 IST)

ఆయనతో సుఖం లేదు.. ఎదురింటాయన మనస్సు పడ్డాడు... ఓకే చెప్పొచ్చా?

చాలా మంది మహిళలకు తమ భర్తల నుంచి ఎలాంటి సుఖం ఉండదు. శోభనం రోజు మొదలుకుని ఏళ్లు గడుస్తున్నా ఇదే పరిస్థితి ఉంటుంది. అయినా.. కుటుంబ పరువు ప్రతిష్టల కోసం పడక సుఖం లేకపోయినా అలానే సంసార జీవితాన్ని సాగదీస్తుంటారు. పైపెచ్చు.. భర్త సుఖం ఇవ్వలేక పోవడం లేదు కాదా.. చీటిపోటి మాటలతో హింసలకు గురి చేస్తూ.. దెప్పిపొడుస్తుంటారు. ఇలాంటి వారు ఎదురింటి పురుషులపై మనస్సు పడుతుంటారు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో వారితో శారీరక సంబంధం పెట్టుకోవచ్చా అనే అంశంపై మానసిక వైద్య నిపుణులను సంప్రదిస్తే... 

సెక్స్ వాంఛ ఎక్కువగా ఉండే మహిళలకు భర్తల నుంచి పడక సుఖం లేక పోవడంతో వారిలో చిరాకు కలగడం సహజమే. ఇది తగ్గాలంటే కేవలం ఆ మహిళ కోరుకునే శారీరక సుఖం దక్కినపుడు మాత్రమే ఆ చిరాకు పోతుందని చెపుతున్నారు.

అయితే, భర్త నిర్లక్ష్యం చేయడం వల్ల సెక్స్ సుఖం లభించక పోతే... వెంటనే చెడు మార్గంలో పయనించాలన్న నిర్ణయం తీసుకోరాదంటున్నారు. భర్త సెక్స్ పట్ల నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారో.. ఆయన సమస్య ఏంటో తెలుసుకుని కౌన్సిలింగ్ చేయించి సమస్య పరిష్కారానికి మార్గం కనుగొనాలని సలహా ఇస్తున్నారు.