జస్ట్ ఆమె అలా టచ్ చేస్తే చాలు.... శరీరం పులకించిపోతుంది... కానీ...

గురువారం, 22 నవంబరు 2018 (14:40 IST)
మేమిద్దరం కాలేజీ డేస్ నుంచి ఒకరికొకరు తెలుసు. కానీ ఇద్దరం ఉద్యోగాలు చేరిన తర్వాతే మాట్లాడుకున్నాం. ఆమె మాట్లాడుతుంటే నాకు తెలియని హాయి కలుగుతుంది. జస్ట్ ఆమె అలా టచ్ చేస్తే చాలు.... శరీరం పులకించిపోతుంది. ఆమె నాతో ఉన్నంతసేపు మరో లోకంలో విహరిస్తున్నట్లు ఉంటుంది. ఈమెతో నేను కాలేజీ రోజుల్లోనే మాట్లాడి ఉంటే ఖచ్చితంగా ఆమెను పెళ్లాడేవాడిని. కానీ... ఇప్పుడు స్నేహం కుదిరింది. 
 
నాకు ఆల్రెడీ పెళ్లయిపోయింది. కానీ ఆమె ఆలోచనలతోనే ఎక్కువసేపు కాలంగడుపుతున్నాను. ఐతే ఉదయం నుంచి సాయంత్రం ఇంటికెళ్లే దాకా నన్ను కవ్విస్తూ మాట్లాడే ఈమె... ఇంటికెళ్లగానే ఫోన్ స్విచాఫ్ చేసేస్తోంది. ఆమెకు అలా చేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా... సర్లే అంటుంది కానీ ఇంటికెళ్లగానే ఆఫ్ చేసేస్తోంది. ఆమె మాటలు విననిదే ఉండలేకపోతున్నా. ఈమధ్య రాత్రికి ఇంటికి వచ్చేస్తానన్నాను. అంతే... అప్పట్నుంచి ఫోన్ తీసుకురావడం మానేసింది. ఫోన్ చెడిపోయిందని చెపుతోంది. ఆమె నన్ను అంతగా ఎందుకు ఉడికిస్తోంది...? వస్తానంటే ఎందుకిలా చేస్తోంది...? అర్థం కావడంలేదు...


 
ఆఫీసు వరకే మీతో స్నేహం. ఇక కవ్విస్తోంది అని అంటున్నారు. ఆమె ఎలా కవ్విస్తుందనేది చెప్పలేదు. మీ మాటలను బట్టి కేవలం ఆమె మీతో మాట్లాడటం వరకే చేస్తోంది. మీరే అతిగా ఊహించుకుంటున్నారు. రాత్రికి వస్తానని మీరు చెప్పినా ఆమె దాన్ని సహించి మీతో మాట్లాడుతోంది. ఆమె మరో రీతిలో ఆలోచిస్తే మీరు చిక్కుల్లో పడుతారు. జాగ్రత్త... ఆమె మీతో ఎలాంటి సంబంధాన్ని కోరుకోవడం లేదని గమనించండి. మీరు ఇంటికి వస్తానన్న తర్వాత ఫోన్ కూడా తీసుకురావడం లేదంటే మీ పట్ల ఆమెకు ఎలాంటి ఆలోచనలు లేవని అర్థం చేసుకోండి. జస్ట్ స్నేహితుడిగానే ఆమె చూస్తున్నారు. మీరు మరోలా చూస్తున్నారు.

అన్నీ చూడండి

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments