మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 22 నవంబరు 2018 (09:26 IST)

ఆ బీచ్‌లో పురుషులు నగ్నంగా తిరుగుతున్నారట...

మన దేశంలో అనేక బీచ్‌లు ఉన్నాయి. కానీ, బెంగుళూరు బీచ్‌లకు ఉన్న ప్రత్యేకత మరేబీచ్‌కు లేదు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండో బీచ్‌గా పేరొందిన చెన్నై మెరీనా బీచ్‌లో కూడా వెకిలి వేషాలు వేయడానికి వీల్లేదు. కానీ, గోవా, బెంగుళూరు బీచ్‌లలో మాత్రం స్త్రీపురుషులు ఇష్టానుసారంగా తిరగొచ్చు. ఈ రెండు బీచ్‌లలో అనేక మంది పర్యాటకులు నగ్నంగా కూడా తిరుగుతుంటారు. 
 
అయితే, తాజాగా బెంగుళూరులోని సముద్రపు ఒడ్డున బీచ్‌లో తిరిగే పురుషులకు డ్రెస్ కోడ్ ఉండాలని కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఎన్‌జీ లక్ష్మీబాయి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి లేఖ రాశారు. గోకర్ణం బీచ్‌లో పురుషులు నగ్నంగా తిరుగుతున్నారనీ ఇలాంటి దృశ్యాలకు అడ్డుకట్ట వేయాలని ఆమె కోరారు. 
 
'నేను బీచ్‌లలో పార్టీలు, వేడుకలు చేసుకోవడాన్ని వ్యతిరేకించడం లేదు. అయితే అక్కడికి వచ్చే జనం గౌరవప్రదమైన దుస్తులు ధరించాలని కోరుకుంటున్నాను. బీచ్‌లలో షార్ట్స్, టీషర్ట్ ధరించడం వరకూ బాగానే ఉంటుంది. అయితే ప్రపంచంలోని చాలా బీచ్‌లలో పూర్తి నగ్నంగా తిరుగుతున్నవారున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ ఇండియాకూ పాకిపోయింది. అయితే ఇది మన సంస్కృతికి విరుద్ధం. అందుకే సీఎంకు ఉత్తరం రాశాను' అని ఆమె వివరణ ఇచ్చారు.