గురువారం, 1 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Selvi
Last Updated : శనివారం, 30 మే 2015 (16:11 IST)

క్షమాగుణంతో ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తెలుసా?

క్షమాగుణాన్ని అలవరుచుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని వైద్యులు అంటున్నారు. మనపట్ల మనం కాని, ఇతరుల పట్ల కాని కఠినంగా వ్యవహరించకూడదు. సాధ్యమైనంతవరకు సమస్యలను పరిష్కరించుకుని, క్షమాగుణాన్ని అలవరుచుకోవాలి. ఎవరిపట్ల అయినా కక్షగా వున్నట్లయితే అది మనస్సును చికాకుపరుస్తుంటుంది. 
 
కాబట్టి మనలోని ప్రతికూల భావాలను వెలికినెట్టేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. అలా చేయాలంటే ఎదురివారిపట్ల కలిగిన కోపాన్ని నియంత్రించుకోగలగాలి. ఎప్పుడైతే క్షమాగుణాన్ని అలవరుచుకుంటారో అప్పుడే ప్రతికూల శక్తి ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. ఫలితంగా అప్పటివరకు వున్న ఒత్తిడి ఆవిరవుతుంది. 
 
ఇతరుల్ని క్షమించే గుణంతోపాటు, మననుమనం ఖండించుకోవడాన్ని కూడా ఆపేయాలి. గతం గతించాలేతప్ప దానికి ఆజ్యం పోసుకోకూడదు. ఎప్పుడూ కూడా మనకుకలిగిన అనుభవాలసారం నుంచి ప్రతిరోజూ మంచి పాఠాలు నేర్చుకుంటూ వుండాలి. చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలి.
 
స్వయం తప్పిదాల్ని విస్మరించి, మరోసారి జరగకుండా చూడాలే కానీ నిందించుకుంటూ కూర్చోకూడదు. ఎందుకిలా దరిగిందన్న చింత, నిందలు పదేపదే ప్రశ్నించుకోవడం మానేయాలి. క్షమాగుణం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవడానికి మార్గం సుగమం అవుతుందని మానసిక నిపుణులు అంటున్నారు.