మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 9 అక్టోబరు 2014 (18:49 IST)

దానం చేస్తే ఆ క్షణమే మరిచిపోండి.. తిరిగి తీసుకుంటే దోషం!

కుడిచేత్తో దానం చేసేది ఎడమచేతికి తెలియకూడదంటారు. అలాంటి దానం అర్హత కలిగిన వారికే చేయాలని పండితులు చెబుతున్నారు. దానం చేయడం ద్వారా పుణ్యఫలం పెరగడంతో పాటు.. పూర్వీకులకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. కానీ అర్హత కలిగినవారికే దానం చేయాలి. అప్పుడే విశేషమైన పుణ్యఫలాన్నిస్తుందని పండితులు అంటున్నారు. 
 
ఇంకా సాధ్యమైనంత వరకూ దానంగా ఇచ్చిన దానిని ఎవరూ వెనక్కి తీసుకోకూడదు. దానం ఏదైనా అది పంచభూతాల సాక్షిగా చేయడం జరుగుతుంది. కాబట్టి అలా దానంగా ఇచ్చిన దానిని తిరిగి తీసుకుంటే దాని దోషం వెంటాడుతుందని పురోహితులు అంటున్నారు. ఈ దోష ప్రభావం అనేక కష్టనష్టాలకు కారణమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
అందువలన దానం చేసిన విషయాన్ని ఆ క్షణమే మరచిపోవాలే తప్ప, ఎలాంటి పరిస్థితుల్లోను తిరిగి దానాన్ని తిరిగి తీసుకోకూడదని పురాణాలు చెబుతున్నాయి.