నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?
నరదృష్టితో అశుభాలు తప్పవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. నరదృష్టి, అసూయ, ద్వేషం వంటి వాటితో కూడుకున్నది. ఈ నరదృష్టి కారణంగా వ్యాపారాభివృద్ధి వుండదు. ఇంకా ఆ ఇంట ప్రతికూల ఫలితాలు వుండవు. అలాంటి నరదృష్టిని తొలగించుకోవాలంటే.. అగస్త్య మహర్షి.. కంటి దృష్టి అనే రాక్షసుడిని సంహరించాడని.. తద్వారా లోకసంరక్షణ జరిగిందని పురాణాలు చెప్తున్నాయి.
ఇంకా ఆ రాక్షస సంహారంతో మహాశక్తి ఒకటి ఉద్భవించినట్లు ఆధ్యాత్మిక పండితుల అంటున్నారు. ఆ మహాశక్తి ఎవరంటే.. కంటి దృష్టి గణపతి. ఈయన దేవతలలో 33వ మూర్తిగా ఈ లోకాన్ని రక్షిస్తాడని విశ్వాసం. అందుచేత కంటి దృష్టి గణపతి పటాన్ని.. ముఖ్యం ఉత్తరం దిశగా తగిలించాలి. ఇంకా పూజగదిలోనూ వుంచి పూజ చేయవచ్చు.
వ్యాపారం చేసే చోట, కార్యాలయాల్లోనూ వుంచడం మంచిది. కంటి దృష్టి గణపతి రూపం.. యుద్ధంలో గెలిచినట్లు వుంటుంది. తద్వారా ఈ రూపాన్ని ఇంటికి వెలుపల వుంచడం ద్వారా నరదృష్టి ప్రభావం వుండదు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. శాస్త్రీయ దృష్టితో గమనించినట్లైతే శుభ దృష్టి గణపతి ఉండటం వల్ల ఆ పరిసర ప్రదేశాల్లో చెడుకి కారణమయ్యే తరంగాలు నివారించడతాయి.