శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 జూన్ 2023 (14:33 IST)

ఎండిన తులసిని సాంబ్రాణిలో వేసి ధూపం వేస్తే..?

sambrani dhupam
సాంబ్రాణి వేయడం ఇంట్లో హోమం చేసినట్లే. సాంబ్రాణి పెట్టడం వల్ల హోమం చేసినంత సకల శుభాలు కలుగుతాయి. సాంబ్రాణి వేయడం ద్వారా నరదృష్టి తొలగిపోతుంది. ఇంకా అసూయలు తొలగి పురోభివృద్ధి కలుగుతుంది. ఇంట ధూపం వేస్తే సంతానం కలుగుతుంది. 
 
సాంబ్రాణికి జపమాల వేసి ధూపం వేస్తే ఆ ఇంట్లో భగవంతుని అనుగ్రహం నిలిచి ఉంటుంది. సాంబ్రాణిలో చందనం వేసి ధూపం వేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సాంబ్రాణిలో గోరింటాకు గింజలు లేదా ఆకుల పొడిని వేస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి.
 
సాంబ్రాణిలో వట్టివేరు వేసి ధూపం వేయాలి. వేప ఆకులను అగరబత్తిలో వేస్తే అన్ని రోగాల నుండి ఉపశమనం పొందవచ్చు. సాంబ్రాణితో ధూపం వేస్తే శత్రుత్వం నశిస్తుంది.
 
ఎండిన తులసిని సాంబ్రాణిలో వేసి ధూపం వేస్తే, వివాహానికి ఆటంకాలు తొలగిపోతాయి. సాంబ్రాణిలో బృంగరాజ్ ఆకుల పొడిని వేసి ధూపం వేస్తే పుణ్యాత్ముల ఆశీస్సులు పొందుతారు.