సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర ఐ॥ పాఢ్యమి తె.5.33 స్వాతి రా.11.47 వర్ణ్యము లేదు. ప. దు. 11.30 ల 12.21.
 
మేషం :- ఐరన్, సిమెంట్, కలప, ఇనుము, ఇసుక, ఇటుక వ్యాపారస్తులకు లాభదాయకం. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. విద్యుత్ రంగంలో వారు మాటపడక తప్పదు. పండ్ల, పూల, కొబ్బరి, కూరగాయ, చల్లని పానీయ, చిరు వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి.
 
వృషభం :- వృత్తి వ్యక్తిగత నిర్ణయాల పట్ల సమన్వయం పాటించండి. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ముఖ్యమైన పనుల విషయంలో నిర్లక్ష్యం పనికి రాదు. మీ వ్యక్తిగత భావాలకు మంచిస్ఫురణ లభిస్తుంది. ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైనరోజు. 
 
మిథునం :- స్త్రీల తెలివితేటలకు మంచిగుర్తింపు లభిస్తుంది. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. తోటలు కొనుగోలుకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మధ్యవర్తిత్వం వహించడంవలన మాట పడవలసివస్తుంది. ఒక ప్రకటన మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. 
 
కర్కాటకం :- మీ పని మీరు చేసుకుపోతారు. ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన లోపం, తోటి వారి సహకారం లభిస్తుంది. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంగారు, వెండి, లోహ రంగాలలో వారికి మందకొడిగా ఉండగలదు. కళా, ఫోటోగ్రఫీ ఉన్నత విద్య, విదేశ వ్యవహారాల రంగాల వారికి అనుకూల సమయం.
 
సింహం :- మిమ్మల్ని తక్కువ అంచనావేసే వారు మీ సహాయం ఆర్థిస్తారు. బంధు మిత్రలతో వేడుకల్లో పాల్గొంటారు. న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. విద్యా, వైజ్ఞానికి విషయాల పట్ల ఆసక్తి పెరుగును. మీ మనస్తత్వం, పనితీరు చాలా మందికి ఆశ్చర్యం, భయంకలిగిస్తుంది.
 
కన్య :- పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పాలు పొందుతారు. స్థిరచరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. స్త్రీలు సహాయ సహకారాలు అందిస్తారు. గత కొంతకాలంగా కుటుంబములోని వివాదాలు తొలగిపోతాయి. అనుకోని విధంగా మీరు ప్రయాణం చేయవలసివస్తుంది.
 
తుల :- కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మ్యులతో ఆంతరంగిక విషయాలను చర్చిస్తారు. కొన్ని కార్యాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతుంది. ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు.
 
వృశ్చికం :- మార్కెట్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. మీకు నచ్చిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. పనివారలతో సమస్యలు తలెత్తగలవు. జాగ్రత్త వహించండి. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. రాజకీయ న్యాయ, బోధన, కళా, సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సహకరంగా ఉంటుంది.
 
ధనస్సు :- విదేశీ పరిచయాల వల్ల పురోగతి లభిస్తుంది. మీ మాటతీరును ఎదుటివారు తప్పుగా అర్ధం చేసుకుంటారు. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత అవసరం. స్త్రీలకు చుట్టుపక్కల వారిలో మంచి గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కోర్టు వ్యవహరాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.
 
మకరం :- స్త్రీలకు బంధువర్గాలతో సమస్యలు, మాటపట్టింపులు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. ప్రతీ విషయంలోను మీ ఆధిక్యతను నిలుపుకుంటారు. ప్రేమికులకు ఎడబాటు, చికాకులు తప్పవు. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
కుంభం :- తలపెట్టిన పనులు అర్థాంతరంగా ముగించవలసి వస్తుంది. ఇతరుల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తాయి. స్త్రీలు శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. భాగస్వామిక చర్చలు ఆశాజనకంగా ఉంటాయి. రాబడికి మించిన ఖర్చులెదురైనా మీ అవసరాలకు సరిపడు ధనం సర్దుబాటు కాగలదు.
 
 
మీనం :- ప్రైవేటు ఉపాధ్యాయులు అధిక ప్రయాసలను ఎదుర్కుంటారు. అవావాహితులలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి చూపుతారు. మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. పాత మిత్రుల కలయికతో మీలో కొంత మార్పు సంభవిస్తుంది.