1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 జులై 2023 (22:16 IST)

ఎవరికైనా నరదృష్టి ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? పరిహారాలు ఏమిటి?

Naradristi
Naradristi
ఎవరికైనా నరదృష్టి ఉందని గ్రహించడం ఎలాగంటే ఆ వ్యక్తిని అలసట ఆవహిస్తుంది. తరచుగా ఆవలింతలు తప్పవు. ఏ పనిలోనూ మనసు లగ్నమై ఉండదు. కొత్త దుస్తులు ధరిస్తే అవి చిరిగిపోతాయి. కొన్నిసార్లు దానిపై కొన్ని నల్ల మచ్చలు ఉండవచ్చు. ఇంట్లో సమస్యలు, అడ్డంకులు, దుఃఖం, ఎడబాటు, నష్టం, ఆస్తుల నష్టం ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. 
 
భార్యాభర్తల మధ్య లేనిపోని సమస్యలు, అనుమానాలు, బంధువులతో శత్రుత్వం, శుభకార్యాలలో ఆటంకాలు, ఒకరికొకరు వైద్య ఖర్చులు, తినడానికి ఇష్టపడకపోవడం, అందరితో మండిపడటం, చెడు కలలు, నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలు మొదలైనవి. నిద్రలేమి పెరిగి ఆహారం ఇష్టపడకపోవచ్చు. తరచుగా అనారోగ్యం సంభవిస్తుంది. చేతిలో ఉన్న వస్తువులన్నీ చేజారిపోతాయి. 
 
అలాంటి నరదృష్టికి పరిహారం ఏంటో చూద్దాం..
సంధ్యా సమయంలో నరదృష్టిని తీసివేయాలి. మంగళవారం లేదా ఆదివారం సాయంత్రం దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున గుమ్మడికాయతో, టెంకాయ, నిమ్మపండుతో దిష్టి తీసుకోవడం చేయవచ్చు. 
 
అలాగే ఇంటిపై నరదృష్టి లేదా దిష్టిని తొలగించుకునేందుకు ఇంటి ముందు అందరూ చూసేలా ప్రధాన ద్వారం వద్ద నీలకుండలో పువ్వులను నింపి వుంచటం మంచిది. వీటికి ముళ్లు వున్న గులాబీ పువ్వులను వాడితే మంచిది. అలాగే ఇంటి గుమ్మానికి  కలబంద మొక్కను లేదా గుమ్మడి కాయను, దిష్టి బొమ్మలను వేలాడదీయడం మంచిది. 
 
అంతేగాకుండా ఫిష్ ట్యాంక్‌ను ఇంట్లో, ఆఫీసులో ఎక్కడైనా ఉపయోగించవచ్చు. సందర్శకుల దృష్టి మరల్చడానికి ఒక చేపల తొట్టిని ఉంచవచ్చు. 
 
ఉప్పు: స్నానం చేసేటప్పుడు నీళ్లలో ఉప్పు కలిపితే శరీర అలసట, సోమరితనం తొలగిపోతుంది. ఇలా వారానికి ఒకసారి చేయవచ్చు. ముఖ్యంగా వారి వారి పుట్టినరోజు లేదా మంగళవారాల్లో ఇలాంటి స్నానం చేయవచ్చు. 
నిమ్మకాయను రెండుగా కట్ చేసి ఒక దానికి పసుపు, ఒక దానికి కుంకుమ వుంచి ఇంటి ప్రధాన ద్వారం వద్ద వుంచవచ్చు. వారంలో ఒకరోజు తలంటు స్నానం చేయాలి. 
 
నిత్యం మన ఇంటికి వచ్చేవారు మన ఇల్లు లేదా మన ఎదుగుదల చూసి అసూయపడితే.. వారిని కాసేపు ఆపి తాగేందుకు వారికి నీరు ఇవ్వండి. ఇలా చేయడం వల్ల వారి మానసిక స్థితి, ఆలోచనలు మారవచ్చు. 
 
స్పటిక రాయిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయడం చేయవచ్చు. ఇది ప్రతికూలతలను తొలగించి అనుకూల ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.