దేవాలయంలో దేవుడిని ఎలా దర్శించుకుంటున్నారు? (Video)

Written By వి
Updated: మంగళవారం, 26 మే 2020 (18:42 IST)
కష్టాలను తీర్చుకోవడానికి మనము భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉంటాము. మనము భగవంతుడిని కోరుకోగానే ఆ భాధలు తీరాలంటే అందుకు తగిన అర్హత భగవంతుడి దగ్గర మనం పొందాలి. అసలు ఆలయానికి వెళ్లినప్పుడు మనం ఎలాంటి మనస్సుతో దేవుడిని దర్శించుకోవాలి. 

ప్రధానంగా ఆలయానికి వచ్చే భక్తుల ప్రవర్తన, ఆలయంలో పాటించాల్సిన అనేకమైన విధులు, నిషేధాలు భృగుమహర్షులవారు వివరంగా తెలియజేసియున్నారు. ఆ నియమాలను విధిగా ఆచరిస్తే భగవంతుని పరిపూర్ణకృపకు పాత్రులవుతాము అవి ఏమిటో తెలుసుకుందాం.
 
1. ఆలయాన్ని ప్రదక్షిణిగా చుట్టి రావడానికి ముందే దైవానికి ప్రసన్నమైన మనస్సుతో నమస్కారం చేయాలి. మెల్లగా ప్రదక్షిణ చేసిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించాలి.
 
2. ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడు దేవాలయం, ధ్వజస్ధంభం నీడనకానీ, ప్రాకారం నీడను కానీ దాటకూడదు.
 
3. యజ్ఞోపవీతం ఉన్నవారు నడుముకు చుట్టుకొని కానీ, చెవికి తగిలించుకుని కానీ, అపసవ్యంగా వేసుకొని కానీ, లేదా దండ వలె ధరించి కానీ ఆలయప్రవేశం చేయకూడదు.
 
4. చంచలమైన మనస్సుతో స్వామిని దర్శించకూడదు. ఆలయంలో దేవుని ముందు నిలబడి అబద్దాలు చెప్పకూడదు. ఎందుకంటే భగవంతుడు సత్యస్వరూపుడు కాబట్టి ఆయన ఎదుట సత్యాన్ని దాచకూడదు.
 
5. దేవాలయంలో దేవునికి వీపు భాగం చూపిస్తు కూర్చోకూడదు.
 
6. వస్త్రంతో కానీ, శాలువాతో కానీ శరీరం కప్పుకోవాలి.
 
7. దేవాలయంలో ప్రవేశించి భక్తితో రోదించకూడదు. రోదిస్తూ దేవుని స్తుతించకూడదు.
 
 

అన్నీ చూడండి

కేతన్ అగర్వాల్ హత్య కేసు : సియా - చేతన్‌లకు ముందుగానే వివాహమైందా?

Siya Goyal: చేతన్ చౌదరిని సియా గోయల్ రహస్యంగా పెళ్లి చేసుకుందా?

30 రోజుల్లో కురవాల్సిన వర్షం 2 రోజుల్లోనే... కారణాలు ఏమిటి?

వైజాగ్ టెక్కీ రాధా గాయత్రి మృతి కేసులో ట్విస్ట్ : మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశం

వయనాడ్‌లో కొండ చరియల బీభత్సం - శిథిలాల కింద ప్రజలు

అన్నీ చూడండి

07-07-2026 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనయోగం ఉన్నాయి.. ఏ రాశికి?

జూలై 7, 2026: కాలాష్టమి.. తేనె రాసిన జిల్లేడు ఆకులు.. నైవేద్యంగా రెండు గులాబ్‌జామూన్‌లు..?

06-07-2026 సోమవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు...

05-07-2026 ఆదివారం ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మవద్దు

05-07-2026 నుంచి 11-07-2026 వరకు ఫలితాలు - కొత్త సమస్య తలెత్తే ఆస్కారం..?

తర్వాతి కథనం
Show comments