1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (18:44 IST)

కార్తీక మాసం చివరి రోజున ఆదిదేవతల పూజ!

భక్తులను ఆదుకునే విషయంలో ఎంతమాత్రం ఆలస్యం కాకుండా ముక్కంటి.. పరమేశ్వరుడిని తొందరచేసేది అమ్మవారే. తల్లి మనసు నుంచి పుట్టే ఆతృత ... ఆరాటం ఈ విశ్వంలో ఇంకెక్కడా కనిపించవు. 
 
తన బిడ్డలకి ఆకలవుతూ ఉంటే తల్లి ఎలా నిలవలేదో, తన అనుగ్రహం అవసరమైనవారిని ఆదుకునేంత వరకూ అమ్మవారు కూడా అలాగే నిలవలేదు.
 
అందుకే సంతాన సౌభాగ్యాల కోసం మహిళా భక్తులు అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆ తల్లి ఆలయాలను దర్శించి కుంకుమ పూజలు చేయిస్తుంటారు ... చీరసారెలు సమర్పిస్తుంటారు. 
 
కార్తీకమాసంలో స్వామివారి సేవలోను ... అమ్మవారి అనుగ్రహంతోను తరించిన భక్తులు, మార్గశిరంలో అడుగుపెడుతూనే ఉమా మహేశ్వరుల అనుగ్రహాన్ని కోరుతూ వారిని ఆరాధిస్తారు. ఇంకా కార్తీక మాసం చివరి రోజున ఆది దంపతులను పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.