మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 11 నవంబరు 2014 (14:29 IST)

పితృతిథి రోజున దేవతా పూజ చేయవచ్చా?

పితృతిథి రోజున దేవతా పూజ చేయవచ్చు. ఈ రోజున దైవానికి పాలు- పండ్లు నైవేద్యంగా సమర్పించవచ్చు. కానీ  మహా నైవేద్యాన్ని మాత్రం పితృ దేవతలతో పాటే నివేదన చేయాలని శాస్త్రం చెబుతోంది.
 
పితృకార్యానికి వచ్చిన బ్రాహ్మణులకు వడ్డన జరుగుతోన్న సమయంలోనే, ఆయా పదార్థాలను మరో పళ్లెంలోకి తీసి దైవానికి సమర్పించాలని అంటోంది. ఈ విధంగా చేయడం వలన ఎలాంటి దోషం కలగదని శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
ముందుగా తల్లిదండ్రులను పూజించాలనీ, ఆ తరువాత దైవాన్ని ఆరాధించాలనే అర్థం ఈ ఆచారంలో దాగివుందనే విషయం మనకి బోధపడుతుందని పండితులు చెబుతున్నారు.