700 ఏళ్లపాటు వెలుగుతున్న అఖండ దీపం గురించి తెలుసా?
700 ఏళ్లపాటు వెలుగుతున్న అఖండ దీపం గురించి తెలుసుకుందాం.. మహిమాన్విత క్షేత్రం తెలంగాణలో వుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయం నిర్మించే సమయంలో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు నంద దీపాన్ని వెలిగించారని.. అప్పటినుంచి ఇప్పటివరకు అఖండ జ్యోతి వెలుగుతూనే ఉందని ఆలయ చరిత్ర చెప్తోంది.
క్రీస్తు శకం 1314 ప్రాంతంలో సుమారు 700 సంవత్సరాలకు పూర్వం.. కాకతీయ రాజుల కాలంలో.. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు అర్చకులు తెలిపారు.
సీతారామస్వామి ఆలయ ఆవరణలోని 16 రాతి స్తంభాలతో కూడిన కళ్యాణమండపం,16 స్తంభాలతో కూడిన ప్రధాన మండపం కలిగి ఉండటం ఈ ఆలయం విశేషం. ఇంకా 700 సంవత్సరాలుగా అఖండ జ్యోతి వెలుగుతూనే ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత.