గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2023 (13:23 IST)

సుప్రీం కోర్టును ఆశ్రయించనున్న టీఎస్‌పీఎస్సీ.. ఎందుకు?

tspsc logo
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో.. ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
దీనిని విచారించిన రాష్ట్ర హైకోర్టు.. పరీక్షను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, హైకోర్టు ఆదేశాలపై టీఎస్ పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
సీనియర్ అడ్వకేట్ ద్వారా సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తే తదుపరి ఏంచేయాలనే విషయంపైనా అధికారులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.