సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 18 జులై 2024 (20:18 IST)

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ ప్రారంభోత్సవం

Sri Guru Baba
ఆదినాథ్ శ్రీ గురు బాబాజీకి అంకితం చేయబడిన అందమైన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక గురువు శ్రీ ఎం ఈ రోజు తన మదనపల్లి ఆశ్రమం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. రోడ్డు, రవాణా మరియు రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ లాంఛనంగా ప్రారంభించిన ఈ ఆలయాన్ని, బాబాజీ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రజల కోసం తెరిచినట్లు శ్రీ ఎం ప్రకటించారు. ఈ ఆలయంలో బాబాజీ దీర్ఘ ఆలోచనతో రాతి గుహలో కూర్చున్నట్లుగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
 
మహావతార్ బాబాజీ అని కూడా పిలువబడే శ్రీ గురు బాబాజీని నాథ్ సంప్రదాయం ద్వారా సర్వోన్నతమైన వ్యక్తి యొక్క అభివ్యక్తిగా భావిస్తారు. ఆయన ప్రధాన శిష్యుడు శ్రీ మహేశ్వరనాథ్ బాబాజీ శ్రీ ఎం యొక్క గురువు. ఈ కష్ట సమయాల్లో మోక్షం లేదా విముక్తిని సాధించడానికి మార్గాలలో ఒకటిగా క్రియా యోగాను నేర్పించిన గొప్ప యోగిగా ఆయన అనేక విశ్వాసాలచే గౌరవించబడ్డాడు. పద్మ భూషణ్ శ్రీ ఎం, స్వయంగా అనుభవజ్ఞుడైన యోగి, ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించి బోధిస్తాడు, క్రియా యోగాను కూడా నేర్పిస్తాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 4000 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయం గురు బాబాజీకి అంకితం చేయబడిన మొదటి అతిపెద్ద ప్రార్థనా స్థలం కావడం విశేషం.
 
ఈ సందర్భంగా శ్రీ ఎం మాట్లాడుతూ, "ఈ బాబాజీ ఆలయం కుల మత భేదాలు లేకుండా అందరికీ తెరిచి ఉంటుంది. మీ హృదయంలో ఉన్న బాబాజీ, ఈ రోజు ఇక్కడ చేసిన ప్రాణ ప్రతిష్ఠ దీనికి సంకేతం". లలిత త్రిషతి, సామవేదాల శ్రావ్యమైన శ్లోకాల మధ్య, శ్రీ యంత్రం- బాబాజీ విగ్రహం రెండింటి యొక్క ప్రాణప్రతిష్ఠ.. శంఖాలు, నాదస్వరం శబ్దాల మధ్య ఘనంగా ముగిసింది. లోతైన ఆత్మపరిశీలన- నిశ్శబ్ద చింతనతో ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగడానికి అన్ని తెగల ప్రజలను ఆలయం స్వాగతించింది. 
 
ఈ కార్యక్రమానికి భారతదేశం- విదేశాల నుండి 2,000 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఇందులో రిటైర్డ్ జస్టిస్ సునీల్ షుక్రే, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, అదనపు జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమంతో వేడుకను ముగించారు. తదనంతరం అక్కడికి విచ్చేసిన వారికి ప్రసాదం పంచారు. శ్రీ ఎమ్ ఆశ్రమంలోని ఆలయం ఇప్పుడు అన్ని విశ్వాసాల సందర్శకులకు తెరిచి ఉంటుంది. ధ్యానం, ఆధ్యాత్మిక సుసంపన్నత కోసం పవిత్ర స్థలంగా మారనుంది.