మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (16:14 IST)

చిన్నశేషుడిపై కళ్యాణ శ్రీనివాసుడు చిద్విలాసం...

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ‌కృష్ణుని అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో వాహనసేవ ఆల‌యంలో  ఏకాంతంగా జరిగింది.
 
రెండో రోజు ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం శుభకరం.
 
రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహన సేవ జ‌రుగ‌నుంది. ఏకాంతంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుండడం భక్తులకు ఇబ్బంది కరంగానే కోవిడ్ కారణంగా టిటిడి ఈ నిర్ణయం తీసుకుంది.