గురువారం, 2 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (09:35 IST)

తమిళ భక్తుడు విరాళం .. రూ.2 కోట్ల విలువ చేసే శంఖుచక్రాల కానుకలు

ఓ తమిళ భక్తుడు ఒకడు కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామికి కోట్లాది రూపాయల విలువే చేసే శంఖుచక్రాలను కానుకగా సమర్పించారు. ఈ శంఖు, చక్రం విలువ రెండు కోట్ల రూపాయలు. వీటిని తమిళనాడుకు చెందిన భక్తుడు సమర్పించారు.
 
ఆ భక్తుడి పేరు తంగదొరు. తేనె జిల్లాకు చెందిన తంగదొరై పరమ స్వామి భక్తుడు. మూడున్నర కిలోల బంగారంతో శ్రీవారికి శంఖు, చక్రాలు చేయించారు. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు చెప్పారు.
 
వీటిని బుధవారం ఉదయం టీటీడీ అదనపు ఈవోకు అందజేశారు. కాగా, తంగదొరై గతంలోనూ శ్రీవారికి బంగారు, వజ్రాభరణాలను విరాళంగా ఇచ్చారు. అందులో బంగారు కటి, వరద హస్తాలు, వడ్డాణం, వజ్రాభరణాలు ఉన్నాయి.