శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (14:05 IST)

#VaishnoDevi : రోజుకు 50వేల మంది భక్తులు మాత్రమే...

జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటై వైష్ణోదేవి ఆలయ సమీపంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదంటూ ఎన్.జి.టి కీలక ఆదేశాలు జారీ చేసింది.

జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటై వైష్ణోదేవి ఆలయ సమీపంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదంటూ ఎన్.జి.టి కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఆలయాన్ని దర్శించుకునేందుకు రోజుకు కేవలం 50 వేల మంది భక్తులు మాత్రమే అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ ఆలయం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కట్రాలో ఉంది. 
 
ఈ ఆలయంలో ఇటీవలి కాలంలో తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఎన్.జి.టి ఈ తరహా నిర్ణయం తీసుకుంది. నిజానికి తిరుమల శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని ప్రతి రోజూ లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. కానీ, ఏ రోజు కూడా తొక్కిసలాటలు చోటుచేసుకోలేదు. అయితే, వేల సంఖ్యలో వచ్చే వైష్ణోదేవి ఆలయంలో మాత్రం ఈ తరహా తొక్కిసలాటలు జరుగుతుండటంతో ఎన్.జి.టి ఈ తరహా నిర్ణయం తీసుకుంది.