శ్రీ గోవిందస్వామి ఆలయంలో విశేషాలు.. ఉత్సవాలు
అక్టోబరు నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. తితిదేకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో అక్టోబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
* అక్టోబరు 13న పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారి గరుడసేవ వైభవంగా నిర్వహించనున్నారు.
* అక్టోబరు 18న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అనంతరం ఆస్థానం నిర్వహిస్తారు.
* అక్టోబరు 21న శ్రీ తిరుమలనంబి ఉత్సవారంభం.
* అక్టోబరు 22న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.
* అక్టోబరు 21న శ్రీ మానవాల మహాముని ఉత్సవారంభం.
* అక్టోబరు 25న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
* అక్టోబరు 27న సాయంత్రం 5.30 గంటలకు దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు.
* అక్టోబరు 30న తిరుమల నంబి సాత్తుమొర.