1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. This is one way to Tirumala Srivari Darshan

తిరుమల శ్రీవారిని ఎలా అయినా దర్శనం చేసుకోవాలంటే ఇది ఒక మార్గమే, కానీ?

Tirumala Srivari Darshan
ఆన్లైన్లో టికెట్లను టిటిడి విడుదల చేస్తుంటే వెంటవెంటనే అయిపోతోంది. అయితే తాజాగా టిటిడి వచ్చే యేడాది జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 28వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

 
జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరం నాడు 1000 బ్రేక్ దర్శన(రూ.500/- లఘు దర్శనం) టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. అలాగే జనవరి 13న వైకుంఠ ఏకాదశి నాడు 1000 మహాలఘు దర్శన(రూ.300/-) టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. 

 
వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 14 నుండి 22వ తేదీ వరకు 9 రోజుల పాటు రోజుకు 2 వేలు చొప్పున లఘు దర్శన(రూ.500/-) టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మిగతా రోజుల్లో సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు 200 చొప్పున, శని, ఆదివారాల్లో 300 చొప్పున బ్రేక్ దర్శన(రూ.500/-) టికెట్లు అందుబాటులో ఉంటాయి.

 
అయితే శ్రీవాణి టికెట్లు తీసుకోవాలంటే ఒక్కొక్క టికెట్‌కు పదివేల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని పది వేల రూపాయలు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది కాబట్టి.. టీటీడీ విడుదల చేస్తున్న ఆన్ లైన్లో మిగిలేది శ్రీవాణి టోకెన్లు మాత్రమే.
తర్వాతి కథనం
జనవరి కోటా సర్వదర్శనం టిక్కెట్లు విడుదల