శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (11:46 IST)

జనవరి కోటా సర్వదర్శనం టిక్కెట్లు విడుదల

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (తితిదే) అధికారులు జనవరి కోటాకు సంబంధించి సర్వదర్శన టిక్కెట్లను సోమవారం విడుదల చేశారు. రోజుకు 10 వేల టిక్కెట్ల చొప్పున విడుదల చేశారు. అయితే ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజుకు 5 వేల చొప్పున టిక్కెట్లను రిలీజ్ చేశారు. ఈ టిక్కెట్లను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే లక్షలాది టిక్కెట్లు అమ్ముడుపోవడం గమనార్హం. 
 
కాగా, ఇటీవల విడుదల చేసిన ప్రత్యేక దర్శక టిక్కెట్లను హాట్ కేకుల్లా కేవలం 60 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. ఇపుడు సర్వదర్శన టిక్కెట్లు కూడా ఇదే విధంగా అమ్ముడుపోయాయి. ఇదిలావుంటే, సెలవు రోజైన ఆదివారం 36162 మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. వీరిలో తలనీలాలు సమర్పించిన వారి సంఖ్య 16642గా ఉంది. ఇక శ్రీవారి ఆదాయం రూ.3.25 కోట్లుగా ఉంది.