హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన శ్రీవారి టిక్కెట్లు
జనవరి నెల కోటాకు సంబంధించి శ్రీవారి దర్శన టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం విడుదల చేసింది. ఈ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ఈ టిక్కెట్లను విక్రయానికి 4.60 లక్షల టిక్కెట్లను ఉంచింది. ఈ టిక్కెట్లు కేవలం 60 నిమిషాల్లో ఖాళీ అయ్యాయి. ఇవన్నీ ప్రత్యేక దర్శన టిక్కెట్లు కావడం గమనార్హం.
ఇకపోతే, జనవరి నెలకు సంబంధించి సర్వదర్శనం టిక్కెట్లు ఇంకా విడుదల చేయాల్సివుంది. జనవరి నలకు సంబంధించి వసతి గృహాల బుకింగ్స్‌ను ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు తితిదే విడుదల చేయనుంది.