Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

తిరుమల శ్రీవారి దర్శనానికి ఇలా వెళ్ళి అలా వచ్చెయ్యవచ్చు...

తిరుమల శ్రీవారి దర్సనం కోసం గంటల తరబడి క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో వేచి ఉండాలి. ఎన్ని గంటలకు దర్శనం అవుతుందో తెలియక ఇబ్బంది పడుతుంటాం. గంటగంటకూ రద్దీ పెరిగితే ఇక అంతే. ఒక రోజంతా కంపార్టుమెంట్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటిది ఇప్పుడు తిర

Written By TJ
Updated: శుక్రవారం, 20 అక్టోబరు 2017 (18:25 IST)
తిరుమల శ్రీవారి దర్సనం కోసం గంటల తరబడి క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో వేచి ఉండాలి. ఎన్ని గంటలకు దర్శనం అవుతుందో తెలియక ఇబ్బంది పడుతుంటాం. గంటగంటకూ రద్దీ పెరిగితే ఇక అంతే. ఒక రోజంతా కంపార్టుమెంట్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటిది ఇప్పుడు తిరుమలలో రద్దీనే లేదు. కారణం దీపావళి పండుగ కాబట్టి. అందరూ తమతమ ఇళ్ళలో పండుగ చేసుకుంటుండటంతో పుణ్యక్షేత్రాలను సందర్శించే వారి సంఖ్య తగ్గిపోయింది.
 
తిరుమలలో అనూహ్యంగా రద్దీ తగ్గిపోయింది. కంపార్టుమెంట్లలోకి వెళితే నేరుగా స్వామివారి దగ్గర వరకు లైన్ ఆగకుండా వెళ్ళిపోతుంది. కేవలం 40 నిమిషాల్లోనే స్వామి దర్శన భాగ్యం లభిస్తోంది. కంపార్టుమెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. పండుగ ఎఫెక్టుతో ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చునని టిటిడి అధికారులు భావిస్తున్నారు.
 
త్వరితగతిన దర్శనం దొరుకుతుండటంతో వెళ్ళిన భక్తులే.. మళ్ళీమళ్ళీ వెళ్ళి స్వామిని దర్శించుకుంటున్నారు. అయితే రేపు శనివారం కాబట్టి ఈ రోజు సాయంత్రం తరువాత మళ్ళీ రద్దీ పెరిగే అవకాశం ఉందని టిటిడి భావిస్తోంది.

అన్నీ చూడండి

పేలిని పవర్ బ్యాంక్.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం (వీడియో)

పవన్ అన్నా.. మీరు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్ర సుభిక్షంగా ఉంటుంది : రాకోట గ్రామ మహిళలు

జిబూటి తీరంలో మునిగిన పడవ - 109 మంది జలసమాధి

జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచాణను వేగవంతం చేయాలి : కోర్టులో ఈడీ మొర

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కోసం ప్రజలతోనే యుద్ధమా : కాక్రోచ్ జనతా పార్టీ

అన్నీ చూడండి

11-10-2026 ఆదివారం మీ రాశి ఫలాలు - ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది

11-10-2026 నుంచి 17-10-2026 వరకు మీ వార రాశి ఫలితాలు.. ఏ విషయాన్నీ..?

Sabarimala: శబరిమల యాత్రికుల కోసం QR కోడ్‌లు, సమాచార కేంద్రాల ఏర్పాటు

10-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు... ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది

Ramanujacharya: నవరాత్రి బ్రహ్మోత్సవాలు... మాడ వీధులు.. రామానుజాచార్యుల ఏర్పాట్లు

తర్వాతి కథనం
Show comments