Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ప్రపంచంలో ఉన్న శ్రీవారి భక్తులందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించా: టిటిడి ఈవో

Written By జె
Updated: శనివారం, 1 జనవరి 2022 (21:55 IST)
ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు టిటిడి ఈవో కె.ఎస్.జవహర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని టీటీడీ ఈవో దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో ఉన్న శ్రీవారి భక్తులందరూ సుఖశాంతులతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించానని చెప్పారు. నూతన సంవత్సరం కావడంతో ఉదయం 2గంటలకే ప్రత్యేక ప్రవేశ దర్శనం పెట్టామన్నారు.

 
అలాగే తిరుపతిలోని చిన్న‌పిల్ల‌ల‌ ఆసుపత్రి గురించి కూడా  మాట్లాడారు. పుట్టుక‌తో వ‌చ్చే గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌ను శ‌స్త్రచికిత్స‌ల ద్వారా స‌రిచేసేందుకు 2020, అక్టోబ‌రు 11న ముఖ్య‌మంత్రివ‌ర్యుల చేతులమీదుగా ఈ ఆసుప‌త్రిని ప్రారంభించిన‌ట్టు తెలిపారు. 

 
పేద కుటుంబాల వారికి ఈ ఆసుప‌త్రి ఆస‌రాగా నిలుస్తుంద‌న్నారు. న‌వంబరు 11 నుండి 2 నెల‌లుగా శ‌స్త్రచికిత్స‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు 45 శ‌స్త్రచికిత్స‌లు జ‌రిగాయ‌ని, వీటిలో 50 శాతానికి పైగా ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీలు కాగా మిగ‌తావి క్యాథ్ ల్యాబ్ ద్వారా చేశార‌ని చెప్పారు.

 
శ‌స్త్రచికిత్స‌ల కోసం 200 పైగా వెయిటింగ్ లిస్టు ఉంద‌ని, వారానికి 20 చొప్పున చేసేందుకు ప్ర‌ణాళిక రూపొందించామ‌ని తెలిపారు. ఇక్క‌డి డాక్ట‌ర్లు అంకిత‌భావంతో సేవలు అందిస్తున్నార‌ని చెప్పారు. మ‌రిన్ని వ‌స‌తులు పెంచ‌డంతోపాటు అవ‌స‌ర‌మైన అధునాత‌న ప‌రిక‌రాలు స‌మ‌కూర్చుతామ‌ని తెలిపారు. మ‌రో మెట్టుగా త్వ‌ర‌లో సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణానికి చ‌ర్య‌లు మొద‌లుపెట్టామ‌న్నారు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments