గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 1 జనవరి 2022 (19:44 IST)

ఉక్కిరి బిక్కిరి అయిన కంగనా రనౌత్.. ఏమైందంటే?

ప్రముఖ సినీనటి కంగనా రనౌత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నూతన సంవత్సరం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి కంగనా రనౌత్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్ద టిటిడి అధికారులు ఆమెకి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

 
అయితే ఆలయం వెలుపలకు వచ్చే సమయంలో అభిమానుల తాకిడితో కంగనా రనౌత్ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరచాలనం చేసేందుకు క్యూలైన్లలో ఉన్న భక్తులు పోటీలు పడ్డారు. బలవంతంగా కంగనారనౌత్ చేతులను లాక్కుని మరి కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. హీరోయిన్‌తో పాటు ఉన్న కుటుంబ సభ్యులు భక్తులను ఎంత వారించినా వినిపించుకోలేదు.

 
ఒకానొక దశలో కంగనాకు తీవ్ర ఆగ్రహం కూడా వచ్చింది, అయితే శ్రీవారి ఆలయం కావడంతో భక్తులను ఏమీ అనలేక ఆమె మెల్లగా అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. నూతన సంవత్సరం కావడంతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లకు చెందిన సినీ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు.