తితిదే ఆన్‌లైన్‌లో 1,09,092 సేవా టికెట్ల విడుదల.. సుప్రభాతానికి 12476 టిక్కెట్లు
తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో సేవా టికెట్లను విడుదల చేసింది. ప్రతి నెలా మొదటివారంలో తితిదే సేవా టికెట్లను విడుదల చేస్తూ వస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో సేవా టికెట్లను విడుదల చేసింది. ప్రతి నెలా మొదటివారంలో తితిదే సేవా టికెట్లను విడుదల చేస్తూ వస్తోంది. అయితే ఈసారి సేవా టికెట్ల విషయానికొస్తే 2 నెలలకు కలిపి ఒకేసారి సేవా టికెట్లను విడుదల చేసింది. మొత్తం 1,09,092 టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.
సుప్రభాతం 12,476, తోమాల, అర్చన 260, విశేషపూజ -3000, అష్టదళ పాదపద్మారాధనసేవ - 140, నిజపాద దర్శనం - 2952, కళ్యాణోత్సవం 21,369, ఊంజల్ సేవ - 5,700, ఆర్జిత బ్రహ్మోత్సవం - 12,255, వసంతోత్సవం - 24,080, సహస్ర దీపాలంకరణ - 26,600 సేవా టికెట్లను తితిదే విడుదల చేసింది.
ఇంత పెద్ద మొత్తంలో ఆన్ లైన్ సేవా టికెట్లను తితిదే విడుదల చేయడం ఇదే ప్రథమం. ఇప్పటికే ఇంటర్‌నెట్ సెంటర్ల వద్ద కొంతమంది దళారీలు టికెట్లను బుక్ చేసే ప్రయత్నం ప్రారంభించారు. ఆధార్ కార్డు ఉన్న భక్తులు నేరుగా ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకొని సేవా టికెట్లను పొందే అవకాశాన్ని తితిదే కల్పిస్తోంది.