భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం ఖాయం : పాక్ మంత్రి

Rashid Ahmed
Last Updated: బుధవారం, 28 ఆగస్టు 2019 (18:47 IST)
పాకిస్థాన్ మంత్రి షేక్ రషీద్ జోస్యం చెపుతున్నారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం జరుగవచ్చని అంటున్నారు. కాశ్మీర్‌లో భారత్ ఉల్లంఘన జరుగుతోందని ఆయన ఆరోపించారు.

ఇదే అంశంపై పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ యుద్ధంపై జోస్యం చెప్పారు. సెప్టెంబరులో కానీ, అక్టోబరులో కానీ భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని, ఇదే చివరి యుద్ధం అని అన్నారు.

కాశ్మీర్‌పై పోరాడేందుకు తమకు సరైన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ముందుకు రావడంలేదని ఆరోపించారు.

మరోవైపు, కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఆర్టికల్ రద్దుపై పాకిస్థాన్ రగిలిపోతున్న విషయం తెల్సిందే. భారత్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని, కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పాకిస్థాన్ మండిపడుతున్నారు.దీనిపై మరింత చదవండి :