గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (18:31 IST)

ఒప్పో రెనో 2 స్మార్ట్‌ఫోన్.. అదిరిందిగా..

మొబైల్స్ తయారీదారు సంస్థ ఒప్పో ఈరోజు భారత మార్కెట్‌లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అదే ఒప్పో రెనో 2. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.55 అంగుళాల డైనమిక్ అమోలెడ్ పనోరమిక్ డిస్‌ప్లేను అమర్చారు. స్నాప్‌డ్రాగన్ 730జి ప్రాసెసర్‌తో పాటు 8 జీబీ ఇంటర్నెల్ ర్యామ్‌లను ఇందులో పొందుపరిచారు. 
 
48 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో పాటు 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరాను కూడా వెనుక భాగంలో అమర్చారు. వీటితో 20ఎక్స్ వరకు డిజిటల్ జూమ్ లభిస్తుంది. 16 మెగాపిక్సెల్ పాపప్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేసారు. 
 
కేవలం 0.8 సెకన్లలో ఈ కెమెరా పైకి వస్తుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ని కలిగి ఉన్న ఈ ఫోన్‌తో పాటు 3డీ గ్లాస్ బ్యాక్‌ను ఇచ్చారు. ఈ ఫోన్‌లో గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, 4000 ఎంఏహెచ్ పవర్‌ఫుల్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని అందిస్తున్నారు.
 
ఒప్పో రెనో 2 స్మార్ట్‌ఫోన్ ఓషన్ బ్లూ, ల్యూమినస్ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.36,990గా ఉంది. ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 20వ తేదీ నుంచి విక్రయించనున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఈ ఫోన్‌కు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఇతర ఆన్‌లైన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ప్రీ ఆర్డర్లను ప్రారంభించనున్నారు. 
 
ఒప్పో రెనో 2 ప్రత్యేకతలు...
 
* 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ 
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 730జి ప్రాసెసర్, 
* 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 
* ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
 
* 48, 13, 2 మెగాపిక్సెల్ ట్రిపుల్‌బ్యాక్ కెమెరాలు 
* 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 
* ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 
 
* బ్లూటూత్ 5.0 యూఎస్‌బీ టైప్ సి, 
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం