వామ్మో.... ఏంటీ లొల్లి... అంటున్న నెటిజన్లు, ఇంతకీ ఏంటది?

సినిమాలలో హీరోలు చెప్పే డైలాగ్‌లను ప్రజలు నిజజీవితంలో కూడా వాడేస్తున్నారు. పైగా అలా వచ్చిన డైలాగ్‌లను ప్రేక్షకులు పంచ్‌లుగా ఉపయోగించుకుంటున్నారు. ఈమధ్యన గబ్బర్‌సింగ్ సినిమాలో వచ్చిన అరె సాంబా రాస్కోరా అంటూ అలీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు,

mohan| Last Modified బుధవారం, 6 జూన్ 2018 (17:31 IST)
సినిమాలలో హీరోలు చెప్పే డైలాగ్‌లను ప్రజలు నిజజీవితంలో కూడా వాడేస్తున్నారు. పైగా అలా వచ్చిన డైలాగ్‌లను ప్రేక్షకులు పంచ్‌లుగా ఉపయోగించుకుంటున్నారు. ఈమధ్యన గబ్బర్‌సింగ్ సినిమాలో వచ్చిన అరె సాంబా రాస్కోరా అంటూ అలీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు, ఈ డైలాగ్‌లన్నీ ఉపయోగించి ఏమి చేస్తారు అని అతడు ప్రశ్నించగా వాటిని ఒక పుస్తకంలో అచ్చు వేయిద్దాం అంటాడు. ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకంటారా.. మరేంలేదండి ప్రస్తుత రాజకీయాలలో చాలామంది నాయకులు అలాంటి డైలాగ్‌లతో జనానికి కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నారు. 
 
అగ్నికి వాయువు తోడైనట్టు వీటిని ప్రపంచమంతటా వినిపించడానికి సోషల్ మీడియా ఎటూ ఉంది. వీరిలో చినబాబు తాను ఎవ్వరికీ పోటీ కానంటూ అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. జయంతిని వర్థంతి అనడం, తమ పార్టీకి కులపిచ్చి ఉందని చెప్పడం, జాతీయ జెండాకు వందనం చేయకపోవడం, 2014 ఎన్నికలకు ముందు మోడీ ప్రధానిగా ఉన్నారని చెప్పడం, అమెరికాలో కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చేలా ఉందనడం వంటి హాస్యాస్పద వ్యాఖ్యలు చేసి నవ్వుల పాలయ్యారు. 
 
మరోవైపు బీకాంలో ఫిజిక్స్ అంటూ జలీల్ ఖాన్‌ని కొన్నాళ్ల పాటు నెటిజన్లు ట్రోల్ చేసారు. చివరకు చంద్రబాబును కూడా వదిలి పెట్టలేదు, హైదరాబాద్‌ని తానే అభివృద్ధి చేసానని ఎన్నో సందర్భాల్లో చెప్పడంతో అక్కడి రోడ్లు గురించి ఎన్నోసార్లు నెటిజన్లు ఆటాడుకున్నారు. నోబెల్ బహుమతి ఇప్పిస్తానని చెప్పడం, అప్పట్లో బ్రిటీష్ వారితో పోరాడిన పార్టీ తమదే అని చెప్పడం వంటి మాటలు నెటిజన్లకు ఆణిముత్యాలుగా దొరికాయి. 
 
నటుడు మురళీమోహన్ వెంకటేశ్వరస్వామిని వెంకన్న చౌదరి అనడం, బాలయ్య బాబు హిందీ స్పీచ్‌ని సోషల్ మీడియాలో వైరల్ చేసి పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు దొరుకుతాడా అని నెటిజన్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ ట్రోల్‌లు రాజకీయాలపై మరింత ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి.దీనిపై మరింత చదవండి :