కామన్వెల్త్ క్రీడలు : మణిపూర్ మాణిక్యం మేరీకోమ్‌కు బంగారు

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా పోటీల్లో భారత్‌ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చిచేరింది. మణిపూర్ మాణిక్యం మేరీకోమ్ ఈ బంగారు పతకాన్ని గెలుచుకుంది. మహిళల బాక్సింగ్ విభాగం

mary kom
pnr| Last Updated: శనివారం, 14 ఏప్రియల్ 2018 (12:01 IST)
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా పోటీల్లో భారత్‌ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చిచేరింది. మణిపూర్ మాణిక్యం మేరీకోమ్ ఈ బంగారు పతకాన్ని గెలుచుకుంది. మహిళల బాక్సింగ్ విభాగంలో ఆమెకు గోల్డ్ మెడల్ వరించింది.
 
కాగా, ఐదు నెలల క్రితం ఆసియా చాంపియన్‌‌షిప్‌‌ను గెలుచుకున్న మేరీ.. అదే దూకుడును కామన్వెల్త్ క్రీడా పోటీల్లోనూ ప్రదర్శించింది. ముఖ్యంగా, ముగ్గురు పిల్లల తల్లి అయిన మేరీ కోమ్ బౌట్‌లో చెలరేగిన తీరు అందర్నీ ఆకట్టుకున్నది. మేరీ సాధించిన పతకంతో భారత్ ఖాతాలో 18వ గోల్డ్ మెడల్ చేరింది. 
 
ఇటీవల బల్గేరియాలో జరిగిన స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్‌లోనూ మేరీ సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకున్నది. 2012లో లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్‌తో పాటు ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ టైటిళ్లు మేరీ ఖాతాలో ఉన్నాయి. మేరీ కోమ్ జీవిత కథ ఆధారంగా ఇప్పటికే బాలీవుడ్‌లో ఓ ఫిల్మ్ రిలీజైన విషయం తెలిసిందే. దీనిపై మరింత చదవండి :