శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 ఏప్రియల్ 2018 (15:01 IST)

గోల్డ్ కోస్ట్ 2018 : డబుల్ ట్రాప్‌లో శ్రేయాసి సింగ్‌కు గోల్డ్ మెడల్

గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ 2018 పోటీల్లో భాగంగా భారత్ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చి చేరింది. ఏడో రోజు షూటింగ్ పోటీల్లో భాగంగా డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో భారత షూటర్ శ్రేయాసి సింగ్ ఈ స్వర్ణ పతకాన్ని సాధించింద

గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ 2018 పోటీల్లో భాగంగా భారత్ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చి చేరింది. ఏడో రోజు షూటింగ్ పోటీల్లో భాగంగా డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో భారత షూటర్ శ్రేయాసి సింగ్ ఈ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫైనల్లో లోకల్ ఫేవరెట్ ఎమ్మా కాక్స్‌పై గెలిచి ఇండియాకు 12వ గోల్డ్ మెడల్ సాధించి పెట్టింది. 
 
2014 గేమ్స్‌లో సిల్వర్ గెలిచిన శ్రేయాసి.. ఈసారి ఫైనల్లో 96 ప్లస్ 2 స్కోరుతో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మూడు రౌండ్ల తర్వాత శ్రేయాసి రెండోస్థానంలో, మరో ఇండియన్ షూటర్ వర్ష మూడోస్థానంలో ఉన్నారు. చివరికి శ్రేయ టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లగా.. వర్ష మాత్రం నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది. అలాగే, పురుషుల 50 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఓం మితర్వాల్‌ కాంస్యం దక్కించుకున్నాడు.