గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (15:52 IST)

కామన్వెల్త్ క్రీడలు : భారత్ ఖాతాలో మరో స్వర్ణం

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా పోటీల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. వరుస పతకాలు సాధిస్తూ అదరహో అనిపిస్తున్నారు. తాజాగా భారత్‌ ఖాతాలోకి మరో బంగారు పతకం వ

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా పోటీల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. వరుస పతకాలు సాధిస్తూ అదరహో అనిపిస్తున్నారు. తాజాగా భారత్‌ ఖాతాలోకి మరో బంగారు పతకం వచ్చి చేరింది. మంగళవారం టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో భారత జట్టు నైజీరియాపై 3-0 తేడాతో విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో భారత్‌కు ఇది తొమ్మిదో స్వర్ణం కావడం విశేషం. ఈ ఒక్క రోజే భారత్‌ రెండు స్వర్ణాలు సాధించింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 9 పసిడి, నాలుగు రజతాలు, ఐదు కాంస్యాలతో మొత్తం 18 పతకాలు సాధించిన భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.