ఆసియా క్రీడల్లో పసిడిని సాధించిన భారత హాకీ జట్టు
ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీ ఫైనల్‌లో జపాన్‌పై 5-1 గోల్స్ తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. తాజాగా సాధించిన ఈ పతకంతో మొత్తం పురుషుల జట్టు నాలుగు గోల్డ్ మెడల్స్‌ను తన ఖాతాలో వేసుకుంది.
అంతేగాకుండా ఈ గెలుపుతో 2024లో పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో నేరుగా పాల్గొనే అర్హత సాధించింది. ఇక ఆసియా హాకీ టోర్నీల్లో ఇప్పటివరకు భారత్ 1966, 1998, 2014లో కూడా స్వర్ణ పతకాలు సాధించడం విశేషం.